https://oktelugu.com/

చైనా సైన్యానికి ధీటుగా బదులిచ్చిన భారత బెబ్బులి ఎవరో తెలుసా?

భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దు వివాదం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కూ తొమ్మిది ద‌శ‌ల్లో కోర్‌ కమాండర్‌ స్థాయిలో చ‌ర్చ‌లు జ‌రిగాయి. అయినా.. ఫ‌లితం తేల‌లేదు. అయితే.. ప‌దో సారి జ‌రిగిన స‌మావేశాల‌కు ముందు చైనా ఓ వీడియోను రిలీజ్ చేసింది. అందులో భార‌త ద‌ళాలు చైనా భూభాగంలోకి చొచ్చుకొస్తున్నాయంటూ ప్ర‌క‌టించింది చైనా. కానీ.. అస‌లు విష‌యం ఏమంటే.. భార‌త భూభాగంలోకి వ‌చ్చిన చైనా సైన్యాన్ని వెన‌క్కి పంపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు భార‌త సైనికులు. ఈ వీడియో ద్వారా అంత‌ర్జాతీయంగా […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 22, 2021 / 11:02 AM IST
    Follow us on


    భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దు వివాదం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కూ తొమ్మిది ద‌శ‌ల్లో కోర్‌ కమాండర్‌ స్థాయిలో చ‌ర్చ‌లు జ‌రిగాయి. అయినా.. ఫ‌లితం తేల‌లేదు. అయితే.. ప‌దో సారి జ‌రిగిన స‌మావేశాల‌కు ముందు చైనా ఓ వీడియోను రిలీజ్ చేసింది. అందులో భార‌త ద‌ళాలు చైనా భూభాగంలోకి చొచ్చుకొస్తున్నాయంటూ ప్ర‌క‌టించింది చైనా. కానీ.. అస‌లు విష‌యం ఏమంటే.. భార‌త భూభాగంలోకి వ‌చ్చిన చైనా సైన్యాన్ని వెన‌క్కి పంపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు భార‌త సైనికులు. ఈ వీడియో ద్వారా అంత‌ర్జాతీయంగా సానుభూతిని పొందేందుకు చైనా ప్ర‌య‌త్నిస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది.

    Also Read: కేంద్రం ‘స్వదేశీ’ సోషల్ ఫైట్..

    అయితే.. ఆ వీడియోలో నార్త్ ఈస్ట్ కు చెందిన ఓ కుర్రాడు భార‌త సైన్యానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. దీంతో.. అత‌ను ఎవ‌రా? అనే చ‌ర్చ మొద‌లైంది. అతడు మణిపూర్‌లోని సేనాపతి జిల్లాకు చెందిన సోయిబా మనినగ్బా రంగ్నామీ అని తేలింది. 2018లో సైన్యంలో చేరిన‌ సోయిబా.. 16 బిహార్‌ రెజిమెంట్‌లో కెప్టెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ విషయాన్ని మణిపూర్‌ ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్ ట్విటర్ ద్వారా వెల్ల‌డించారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘మెన్షన్‌ ఆఫ్‌ డిస్పాచెస్‌’ గౌరవాన్ని కూడా పొందాడు సోయిబా.

    కాగా.. గ‌ల్వాన్ లోయ‌లో అప్పుడు ఏం జ‌రిగిందంటే.. జూన్‌ 6వ తేదీన జరిగిన భారత్-చైనా కోర్‌కమాండర్‌ స్థాయి సమావేశంలో గల్వాన్‌ లోయలో చైనా దళాలు వేసిన టెంట్లను తొలగించాలని ప‌ర‌స్ప‌ర‌ అంగీకారానికి వచ్చారు. 15వ తేదీ సాయంత్రం కమాండింగ్‌ ఆఫీసర్ కల్న‌ల్‌ సంతోష్‌బాబు చైనా అధికారిని కలిసి జూన్‌6వ తేదీ నాటి ఒప్పందాన్ని అమలు చేయాలని కోరారు. కానీ.. ఒప్పందాన్ని అమ‌లు చేయ‌క‌పోగా.. చైనా దళాలు సంతోష్‌బాబుపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి.

    Also Read: పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం.. ఎవరికెన్ని సీట్లంటే?

    దీంతో భార‌త సైనికులు ఆగ్ర‌హించి, భారీ సంఖ్యలో చైనా స్థావరం వద్దకు దూసుకెళ్లి ప్రతిదాడి చేశారు. ఈ దాడి కొన్ని గంటల పాటు సాగింది. ఈ ఘటనలో చైనా సైనికులు కూడా పెద్ద‌ సంఖ్య‌లో మృతిచెందారు. మ‌రి, తాజాగా చైనా విడుదల చేసిన సోయిబా మనినగ్బా రంగ్నామీ వీడియో అప్ప‌టిదేనా అన్న‌ది తెలియ‌రాలేదు.

    అయితే.. నాటి దాడిలో చైనావైపు దాదాపు 40 మంది సైనికులు మ‌ర‌ణించి ఉంటార‌ని భార‌త సైన్యం చెబుతోంది. కానీ.. చైనా మాత్రం ఎవ‌రూ చ‌నిపోలేద‌ని చెప్పింది. అయితే.. ఇటీవల చైనా వ్యూహాత్మక మిత్రదేశమైన రష్యాకు చెందిన అధికారిక పత్రిక కూడా 40 మందికిపైగా చైనా జవాన్లు మృతి చెందారనే వార్తను ప్రచురించింది. దీంతో పరువు కాపాడుకోవడానికి గల్వాన్‌ ఘర్షణలో మృతిచెందిన నలుగురిని చైనా మిల‌ట‌రీ గౌర‌వించింది. మొత్తానికి సైనికుల మ‌ర‌ణాల‌పై అబ‌ద్దం చైనా అబ‌ద్ధం చెబుతోంద‌ని తేలిపోయింది. ఇక‌, తాజాగా విడుద‌ల చేసిన వీడియోలో భార‌త సైన్యం త‌మ భూభాగం మీద‌కు వ‌చ్చింద‌ని చెప్ప‌డం కూడా అస‌త్య‌మే అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్