ప్రాంతీయ పార్టీలంటే అవి ఒక్క రాష్ట్రానికే పరిమితం. అందుకే.. వాటిని ప్రాంతీయ పార్టీలు అంటుంటాం. కానీ.. కొన్ని పార్టీలు ఇతర రాష్ట్రాల్లోనూ తమ హవా చాటాలని తాపత్రయ పడుతుంటాయి. కానీ.. చివరికి బోల్తా పడుతుంటాయి. బీహార్‌లో లాలూప్రసాద్ యాదవ్ పార్టీ జార్ఖండ్‌లో ప్రభావం చూపలేకపోయింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బీఎస్పీ, సమాజ్ వాదీ పార్టీలు ఏమాత్రం సక్సెస్ సాధించలేకపోయాయి. ఇక తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో విజయం సాధించినా తెలంగాణలో మాత్రం పూర్తిగా పడకేసింది.
Also Read: అసలు కథ ముందుంది.. మున్సిపల్ ఎన్నికలు ప్రభుత్వానికి రెఫరెండమేనా?
ఇక వైసీపీది కూడా అదే పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓటు బ్యాంకు పటిష్టంగా ఉన్న వైసీపీ, టీడీపీలు రాష్ట్రం విడిపోగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమయ్యాయి. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. రెండు రాష్ట్రాలకు సంబంధించి సమస్యలు ఉండటంతో వాటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా వైసీపీ, టీడీపీలకు ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబు మాత్రం టీడీపీకి అక్కడ బలంలేకపోయినా అలాగే కొనసాగిస్తున్నారు.
కానీ.. వైసీపీ అధినేత జగన్ మాత్రం తెలంగాణలోపార్టీని పూర్తిగా పక్కన పెట్టేశారు. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ తెలంగాణ వైసీపీ యాక్టివిటీస్ ను పూర్తిగా అటకెక్కించారు. పూర్తిగా ఏపీ రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. అనుకున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలంగాణ వైసీపీ జోలికి వెళ్లలేదు. ఏపీలో అధికారంలోకి రావడంతో తెలంగాణ వైసీపీ నేతలు అనేక మంది ఇక్కడ జరుగుతున్న ఎన్నికలలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. కానీ.. జగన్ మాత్రం ఎందుకో నో చెబుతూ వచ్చారు.
Also Read: ఇక జగన్ ఫోకస్ అంతా వారిపైనే..!
రెండు రాష్ట్రాల్లో ఒకే పార్టీ మనుగడ సాధించలేదన్నది జగన్ నమ్మకం. అందుకే వైఎస్ షర్మిలతో కొత్త పార్టీ పెట్టిస్తున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. షర్మిల పార్టీ వెనుక ఎవరు ఉన్నారన్నది పక్కన పెడితే.. పార్టీ క్యాడర్‌ను, నేతలను కాపాడుకోవడానికి షర్మిల రూపంలో ఒక పార్టీ తెలంగాణలో ముందుకు రావడం గమనార్హం. దీనివల్ల వైఎస్ అభిమానుల్లో కొత్త జోష్ అయితే నింపుతోంది. షర్మిల కొత్త పార్టీ వచ్చినా రాకపోయినా, వైసీపీని అక్కడ కిల్ చేయడమే జగన్ తీసుకున్న మంచి నిర్ణయమని పార్టీలో అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్