Munugode By Poll 2022: తెలంగాణలో రాజకీయ పార్టీల ప్రచారం కొత్తపుంతలు తొక్కుతుంది. ఇన్నాళ్లు ఒక లెక్క ఇప్పటినుంచి ఒక లెక్క అన్నట్లుగా మూడు ప్రధాన పార్టీలు విభిన్నంగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ వినూత్న ప్రచార శైలినీ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

జనంలోకి దూసుకెళ్లిన బీజేపీ స్లోగన్..
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అన్నట్లుగా దూకుడు పెంచిన బీజేపీ వినూత్న కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. హుజురాబాద్.. దుబ్బాక జీహెచ్ఎంసి ఎన్నికల్లో విజయం ఆ పార్టీలో మరింత ఉత్సాహాన్ని పెంచింది. ఈ క్రమంలో టిఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాలని ‘సాలు దొర సెలవు దొర’ అనే స్లోగన్ ను పార్టీ కార్యాలయం వద్ద డిజిటల్ బోర్డు రూపంలో ఏర్పాటు చేసింది. కెసిఆర్ ఫోటోతో పాటు ఏర్పాటుచేసిన ఈ బోర్డు ఇటు సోషల్ మీడియాలను అటు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలను విస్తృతంగా ప్రచారం కావడంతో ఆ స్లోగన్ జనంలోకి వేగంగా దూసుకెళ్లింది. దీనిపై కోర్టుకు వెళ్లడంతో సీఎం కేసీఆర్ బొమ్మను తొలగించి డిజిటల్ బోర్డులు మాత్రం అలాగే ఉంచారు. అక్కడ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైనట్లు రోజులను తెలిపే బోర్డు ఏర్పాటు చేశారు. సాలు దొర సెలవు దొర నినాదం పేరుతోనే ఫేస్ బుక్, ట్విట్టర్. ఇన్ స్టాగ్రామ్ లో కూడా ప్రత్యేక అకౌంట్లు బిజెపి నాయకులు ఏర్పాటుచేసి కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
Also Read: Delhi Liqour Scam Telugu States: తెలుగు రాష్ట్రాలపై గేమ్ స్టాట్ ..బీజేపీకి లిక్కర్ స్కాం భలే స్కోర్
-బీజేపీకి దీటుగా టిఆర్ఎస్ స్లోగన్..
బీజేపీ నాయకులు ‘సాల దుర సెలవు దొర’ నినాదంతో బోర్డు ఏర్పాటు చేయగా ప్రతిగా టిఆర్ఎస్ నాయకులు ‘సాలు మోడి సంపకు మోడీ’ అనే నినాదం జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పెరుగుతున్న గ్యాస్ పెట్రోల్ ఇతర నిత్యావసర ధరలతో ప్రజలు దేశంలో బతకలేని పరిస్థితి ఏర్పడిందని.. ఎందుకు కారణం ప్రధాని నరేంద్ర మోడీ అని టిఆర్ఎస్ ఈ స్లోగన్ ను తీసుకొచ్చింది. దీన్ని విరుద్ధంగా ప్రచారం చేసేందుకు హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో మోడీ ఫోటోతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించింది. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాదులో నిర్వహిస్తున్న వేళ కూడా టిఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీల ప్రచారం చేపట్టారు. ఈ నినాదం కూడా జనాలను ఆకర్షించింది.

-ఖర్చు పెట్టలేం.. కాళ్లు మొక్కుతాం..
ప్రస్తుతం మునుగోడులో అన్ని రాజకీయ పార్టీల్లో కాక రేపుతుంది. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయడంతో ఇక్కడ విజయం కోసం అన్ని పార్టీలు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆ పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం ఎంతైనా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఈ పార్టీ వారికి దీటుగా డబ్బులు ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంది. మరోవైపు మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కావడం ఆ పార్టీకి గెలుపు అనివార్యమైంది. దీంతో బిజెపి టీఆర్ఎస్ లకు దీటుగా ప్రజలను కలవాలని పార్టీ ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం రాజీవ్ గాంధీ జయంతిని ఎంచుకుంది. ఈరోజు నుంచి లక్ష మంది కాళ్లు మొక్కాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్ణయించారు. డబ్బులు ఖర్చు చేయలేని నేపథ్యంలో కాళ్ళు మొక్కి ఓట్లు అభ్యర్థించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాళ్ళు మొక్కడం ద్వారా సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
–ఓట్ల కోసం పాట్లు తప్పనిసరి..
సాధారణంగా ఏ ఎన్నికలు వచ్చినా ఓట్ల కోసం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ పద్ధతులను అవలంబిస్తారు. ఇందులో హోటల్ లో టీ తయారు చేయడం.. దోసలు వేయడం.. ఓటర్ల ఇంటికి వెళ్లి పిల్లలకు స్నానాలు చేయించడం పిల్లలను ఎత్తుకొని ముద్దు చేయడం.. వృద్ధులను ఆశీర్వదించాలని కోరడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సరికొత్తగా ఆలోచించింది. ఓటర్ల కాళ్ళు మొక్కడం ద్వారా ఆశీర్వాదం తీసుకోవడంతో పాటు గతంలో చేసిన పొరపాటు ఏమైనా ఉంటే క్షమిస్తారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఎంతవరకు వరకు ఫలిస్తుందనేది మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలే నిర్ణయిస్తాయి.
Also Read:Pawan kalyan On Rayalaseema: రాయలసీమ కష్టాలపై కదిలివస్తున్న పవన్ కళ్యాణ్

