Deepika Ranveer New House: దీపికా పడుకోణె ప్రస్తుతం తన భర్త రణవీర్ సింగ్ తో దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తోంది. పైగా తమ సంసారం సాఫీగా సాగడానికి దీపికా పడుకోణె అన్ని విధాలుగా తగిన ఏర్పాట్లు చేసుకుంటుంది. తాజాగా దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ తమ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఇద్దరు కలిసి చేసిన పూజకి సంబంధించిన ఫోటోలను తమ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.
రణ్వీర్ – దీపిక ఇద్దరూ తెల్లటి దుస్తులలో కనిపిస్తూ అభిమానులను అలరించారు. అయితే, ఇద్దరు తమ ముందు తమ పూర్వీకుల ఫోటోలను పెట్టుకుని కనిపించడం విశేషం. అలాగే ఈ ఇద్దరు కలిసి తమ ఇంటి గేట్లను తెరిచినట్లు కూడా ఒక ఫోటో ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఇక రణవీర్ ఈ ఫోటోలకు ఎలాంటి క్యాప్షన్స్ ను పోస్ట్ చేయలేదు. కానీ, ఒక ఎమోజీని మాత్రం జోడించాడు.
ఇంతకీ, ఈ ఇంటి ఖరీదు ఎంతో తెలుసా ?, రూ.119 కోట్లు. ఈ ఇంటిని గతంలోనే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రణవీర్ తన తండ్రి కంపెనీ ఉన్న బాంద్రాలోని BJ రోడ్ కి దగ్గరగానే ఈ బంగ్లా ఉంది. సాగర్ రేషమ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కిందా ఈ ఇల్లు వస్తోంది. కార్పెట్ ఏరియాలో ఉన్న ఈ ఇల్లు 11,266 చదరపు అడుగుల విస్తీర్ణం, 1,300 చదరపు అడుగుల టెర్రస్ ఉంది.
టెర్రాస్ విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఒక చ.అ.కు రేటును లెక్కించినట్లయితే, అది చదరపు అడుగులకు ₹1.05 లక్షలుగా ఉంటుంది. అన్నట్టు హీరో షారుఖ్ ఖాన్ మన్నత్ బంగ్లా కూడా ఇదే ప్రాంతంలో ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. రణవీర్ ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో చేస్తున్న సర్కస్ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు.
ఇక దీపికా పదుకొణె పెళ్లి తర్వాత కూడా బోల్డ్ సీన్స్ లో మొహమాటం లేకుండా విచ్చలవిడిగా రెచ్చిపోతుంది. ఆమె లాస్ట్ సినిమా గెహ్రాహియా అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో గ్లామర్ డోస్ పెంచిన దీపికాను చూసి అందరూ షాక్ అయ్యారు. కానీ సినిమా మాత్రం హిట్ కాలేదు.