Kamal Hassan- Gentleman: తెలుగులో 1992లో వచ్చిన జెంటిల్ మెన్ సినిమా ఎంత విజయం సాధించిందో తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ గా సినిమా ఖ్యాతి గడించింది. అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. దీంతో జెంటిల్ మెన్ సినిమాతో శంకర్ కు ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ తనదైన సినిమాల నిర్మాణంతో శంకర్ దూసుకుపోయిన సంగతి తెలిసిందే. జెంటిల్ మెన్ తరువాత భారతీయుడు తీసి తన స్టామినా మరోసారి రుజువు చేసుకున్నాడు. తదుపరి ఒకేఒక్కడు సినిమాతో ఇంకా తన సత్తా మరోసారి చాటాడు. జీన్స్, అపరిచితుడు, ఐ, రోబో సినిమాల ద్వారా తనలోని శక్తిని చాటాడు.
శంకర్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన రాజమౌళి కూడా శంకర్ టాలెంట్ ను పుణికిపుచ్చుకుని ప్రస్తుతం గురువును మించిన శిష్యుడిగా మారాడు. తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించి పెట్టడం తెలిసిందే. శంకర్ ప్రస్తుతం రాంచరణ్ తో ఓ సినిమా కమల్ హాసన్ తో మరో సినిమా చేస్తున్నాడు. శంకర్ కమల్ హాసన్ కలయికలో వచ్చిన భారతీయుడు ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. భారతీయుడు ఇప్పటికి కూడా ఓ అద్భుతమైన సినిమాగానే ప్రేక్షకులు ఆదరించడం విశేషం.
Also Read: Prabhas Marriage: ప్రభాస్ ని పెళ్లంటే భయపడేలా చేసిన ఓ అమ్మాయి మోసం… తల్లి బయటపెట్టిన షాకింగ్ రీజన్!
జెంటిల్ మెన్ కథను మొదట కమల్ హాసన్ తో తీయాలనుకున్నాడట. కథ కమల్ హాసన్ కు చెప్పడంతో అతడికి కథ నచ్చకపోవడంతో నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో అర్జున్ ను కలవడంతో అతడు ఓకే చెప్పడంతో కథ పట్టాలెక్కింది. మొత్తానికి కమల్ అనుకుంటే అర్జున్ కు దక్కింది అదృష్టం. దీంతో కమల్ హాసన్ కాదనుకున్న సినిమా అర్జున్ దరి చేరడంతో భారీ బడ్జెట్ తో సినిమా రూపుదిద్దుకుంది. జెంటిల్ మెన్ లో మధుబాల, శుభశ్రీ నటించారు. ప్రత్యేక పాత్రలో చరణ్ రాజ్ నటన కూడా సినిమాకు హైలెట్ అయింది.
కమల్ హాసన్ ఓ ఇంటర్వ్యూలో ఈ కథకు సంబంధించిన విషయం ప్రేక్షకులతో పంచుకున్నారు. జెంటిల్ మెన్ కథలో మార్పులు చేయాలని తాను సూచించానని చెప్పారు. కథలో కొన్ని మార్పులు చేస్తే తాను నటిస్తానని చెప్పానని వెల్లడించారు. కానీ అదే కథను అర్జున్ కు చెబితే ఆయనకు నచ్చడంతో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి సినిమాతోనే రికార్డులు బద్దలు కొట్టాడు శంకర్. దీంతో తరువాత ఆయన వెనుకకు చూసుకోలేదు. అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడం గమనార్హం.