https://oktelugu.com/

15 నుండి రైల్వే, విమాన బుకింగ్ లకు సంకేతాలు

ఒక వంక దేశంలో కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతున్నా పరిష్టితులు అదుపు తప్పడం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో భరోసా వ్యక్తం అవుతున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే ఈ నెల 14 తర్వాత లాక్ డౌన్ పొడిగించే ఆలోచన లేదని కేంద్ర ప్రస్తుతం స్పష్టం చేయడంతో తిరిగి జన జీవనం త్వరలో సాధారణ స్థితికి చేరుకోవచ్చనే భరోసా ఏర్పడుతున్నది. అందుకు స్పష్టమైన సంకేతం ఇస్తూ ఈనెల 15 నుంచి రైల్వే, విమాన బుకింగ్‌లు తిరిగి ప్రారంభం కావచ్చనే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 2, 2020 / 03:38 PM IST
    Follow us on


    ఒక వంక దేశంలో కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతున్నా పరిష్టితులు అదుపు తప్పడం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో భరోసా వ్యక్తం అవుతున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే ఈ నెల 14 తర్వాత లాక్ డౌన్ పొడిగించే ఆలోచన లేదని కేంద్ర ప్రస్తుతం స్పష్టం చేయడంతో తిరిగి జన జీవనం త్వరలో సాధారణ స్థితికి చేరుకోవచ్చనే భరోసా ఏర్పడుతున్నది.

    అందుకు స్పష్టమైన సంకేతం ఇస్తూ ఈనెల 15 నుంచి రైల్వే, విమాన బుకింగ్‌లు తిరిగి ప్రారంభం కావచ్చనే సంకేతాలు ఇస్తున్నారు. ‘‘ఏప్రిల్ 15 నుంచి ఐఆర్‌సీటీసీ నుంచి టిక్కెట్ బుకింగ్స్ అనుమతిస్తాం. లాక్‌డౌన్ 14 వరకే ఉంది. అందుకే క్రమక్రమంగా తిరిగి పని ప్రారంభం చేయాల్సిన అవసరం ఉంది” అని రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

    ముందుగా ప్యాసింజర్స్ రైళ్లను మెళ్లిగా ప్రారంభిస్తామని చెబుతున్నారు. అయితే ప్రయాణికుల ప్రయాణాలు మాత్రం ఏప్రిల్ 15 నుంచే ప్రారంభం కాకపోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు విమాన సర్వీసుల బుకింగ్ కూడా ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తున్నది.

    ఇండిగో, స్పైస్ జెట్, గో ఏయిర్ లాంటి సంస్థలు తమ బుకింగ్‌లను ప్రారంభించనున్నట్లు తెలుస్తున్నది. అయితే ఆ సంస్థలు మాత్రం అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు.

    ఇప్పటి వరకు దేశం మొత్తం మీద 50 మృతులు నమోదు కాగా, మొత్తం కేసులు 1,764 నమోదయ్యాయి. నిజాముద్దీన్ కార్యక్రమంలో పాల్గొన్నవారికే ప్రస్తుతం ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.