కరోనా విరాళం టాటా తరవాత అజీమ్ ప్రేమజీ

కరోనా వైరస్ ప్రపంచాన్ని కాటేస్తున్న సమయంలోమన దేశానికి చెందిన పలువురు ప్రముఖ వ్యాపార దిగ్గజాలు తమ వంతు ఆర్ధిక సాయం చేసి పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఒక పక్క లాక్‌డౌన్ మరోవైపు ప్రజా రవాణా బంద్ చేయడంతో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రెక్కాడితేగాని డొక్కాడని శ్రామికులు ఎందరో రోడ్డున పడ్డారు. ఈ అత్యవసర సమయం లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ తో పాటు కొంత డబ్బు కూడా ఇవ్వడం కూడా […]

Written By: admin, Updated On : April 2, 2020 7:04 pm
Follow us on


కరోనా వైరస్ ప్రపంచాన్ని కాటేస్తున్న సమయంలోమన దేశానికి చెందిన పలువురు ప్రముఖ వ్యాపార దిగ్గజాలు తమ వంతు ఆర్ధిక సాయం చేసి పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఒక పక్క లాక్‌డౌన్ మరోవైపు ప్రజా రవాణా బంద్ చేయడంతో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రెక్కాడితేగాని డొక్కాడని శ్రామికులు ఎందరో రోడ్డున పడ్డారు. ఈ అత్యవసర సమయం లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ తో పాటు కొంత డబ్బు కూడా ఇవ్వడం కూడా జరుగుతోంది . అయితే ఈ క్రమంలో తమ వంతుగా సాయం చేయడానికి దేశానికి చెందిన రాజకీయ నేతలు, సినీ రంగపు వ్యక్తులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, క్రీడారంగపు ప్రముఖులు ఆర్ధిక సాయం చేసేందుకు ముందు కొస్తున్నారు.

ఇప్పటికే పలువురు తమ వంతుగా వివిధ రూపాల్లో సాయం ప్రకటించడ మైంది. ..దేశానికే తలమానికం అయిన టాటా సంస్థల అధినేత రూ.1500 కోట్లు విరాళం ప్రకటించి ఆ విషయంలో కూడా తానే ముందున్నానని నిరూపించాడు. టాటా అధినేత ఇంకా అవసరం అయితే దేశానికి తన యావదాస్థిని ఇచ్చేందుకు సిద్ధం అని కూడా వినమ్రంగా తెలిపారు. తాజాగా `విప్రో` అధినేత అజీం ప్రేమ్‌జీ ముందుకొచ్చారు. ఈయన కరోనా విపత్తు నివారణ క్రమంలో రూ. 1,125 కోట్ల సాయం చేయనున్నట్లు తెలిపారు. విప్రో లిమిటెడ్ రూ.100 కోట్లు, విప్రో ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ రూ. 25కోట్లు, అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ రూ. 1000 కోట్లు ఇస్తున్నట్లు అజీం ప్రేమ్ జీ వెల్లడించారు. ఈ ఫౌండేషన్‌ తో సంబంధం లేకుండా ఫౌండేషన్‌ లో పనిచేసే సంస్థ ప్రతినిధులు కూడా అదనంగా విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. కాగా.. ఈ భారీ విరాళాలకు ముందుగా రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ రూ.500 కోట్లు మరియు ఇన్పోసిస్ సంస్థ రూ.100 కోట్లు విరాళం ప్రకటించడం జరిగింది..
Also Read: కరోనాపై పోరాటానికి గంభీర్ సాయం