RRR vs Ghani: థియేటర్ల వద్ద “ఆర్ఆర్ఆర్” హంగామా వరుణ్ తేజ్ “గని” పై తీవ్రంగా చూపించింది. దీనికి తోడు రొటీన్ స్పోర్ట్స్ డ్రామాతో వరుణ్ తేజ్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చూపించడంలో ఘోరంగా విఫలం అయ్యాడు. కనీస వసూళ్లను కూడా సాధించలేక గని చతికిలపడింది. నిజానికి “ఆర్ఆర్ఆర్” విడుదలై రెండు వారాలు అవుతుంది.
‘గని’ సినిమాలో మ్యాటర్ ఉండి ఉంటే.. బాక్సాఫీస్ వద్ద పూర్తిగా చతికిల పడాల్సిన పరిస్థితి ఉండేది కాదు. అల్లు బాబీ ‘గని’ సినిమాకి నిర్మాత కావడంతో ఈ సినిమా పై చిన్నపాటి ఆసక్తి కలిగింది. కానీ.. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడమంటే కుదరదు కదా. అందుకే.. వరుణ్ తేజ్ కెరీర్ లోనే ‘డిజాస్టర్’ ఫిగర్స్ నమోదు చేసింది గని.
వాస్తవానికి “గని” చిత్ర నిర్మాతలు భయపడుతూనే తమ సినిమాను రిలీజ్ చేశారు. భారీ కలెక్షన్స్ రాకపోయినా.. పెట్టిన పెట్టుబడి అయినా వస్తే చాలు అనుకుని ఈ సినిమాని వదిలారు. మరొక ప్రత్యామ్నాయ తేదీ లభించకపోవడం కూడా ఈ సినిమా విడుదలకు ముఖ్య కారణం అయ్యింది.
కానీ, తీరా సినిమా రిలీజ్ అయ్యాక, పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఓ కొత్త హీరోకి వచ్చిన కలెక్షన్స్ కూడా వరుణ్ తేజ్ కి రాకపోవడం ఆశ్చర్యకరం. వరుణ్ తేజ్ ను నిందించలేం. కానీ, బాధ్యత తీసుకోవాల్సింది హీరోనే. హీరోని చూసే పంపిణీదారులు ఒక్కో ఏరియాకి భారీ మొత్తం ఇచ్చారు. ఉదాహరణకు… వైజాగ్ తీసుకుందాం.
Also Read: తల్లి కాబోతున్న ‘పవన్ కళ్యాణ్’ హీరోయిన్ !
వైజాగ్ లో ‘గని’ సినిమాను 60 లక్షలకు అమ్మారు. ఈ సినిమాకి ఇది చాలా ఎక్కువ. కానీ కలెక్షన్స్ ఎంత వచ్చాయో తెలుసా 18 లక్షలు. ఇలాంటి పరిస్థితే అన్నీ చోట్ల ఉంది. ఈ కారణంగా పంపిణీదారులు దారుణంగా బలయ్యారు. అయితే.. గని సినిమా డిజాస్టర్ కి మరో కారణం కూడా ఉంది. “ఆర్ఆర్ఆర్” లాంటి భారీ విజువల్ ఎమోషనల్ డ్రామాను చూసిన తర్వాత, ఇది గని లాంటి రొటీన్ రొట్ట కొట్టుడు డ్రామాను ఎలా ఇష్టపడతారు.
పైగా ఏ మాత్రం కొత్తదనం లేకుండా వచ్చే సన్నివేశాలు ముందే అర్ధమైపోయే ఈ రెగ్యులర్ గని ప్రేక్షకులను మెప్పించడం అనితర సాధ్యం. అందుకే.. “గని” కనీస కలెక్షన్స్ ను కూడా నోచుకోలేక నష్టాల వలయంలో చిక్కుకుపోయింది.
Also Read: చిరు ఇమేజ్ ను పెంచిన ఘరానా మొగుడు.. దీని వెనక జరిగిన ఆసక్తికర పరిణామాలు ఇవే…