రేపే మొదటి విడత పంచాయతీ పోలింగ్‌

ఏపీలో పంచాయతీ పోరు నడుస్తోంది. మొదటి విడత నామినేషన్లు.. విత్‌డ్రా ప్రాసెస్‌ ఇప్పటికే పూర్తయింది. రేపు మొదటి విడత పోలింగ్‌ జరగబోతోంది. ఈ మేరకు ఏర్పాట్లలో అధికార యంత్రాంగం బిజీ అయింది. ఒంగోలు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 192 గ్రామ పంచాయతీ సర్పంచులు, 1417 వార్డు సభ్యుల పదవులకు పోలింగ్‌ ఉదయం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3.30 వరకూ కొనసాగుతుంది. ఇందుకు అధికారులు 2,365 కేంద్రాలను ఏర్పాటు చేశారు. Also Read: టీడీపీ నిధుల వేట..: […]

Written By: Srinivas, Updated On : February 8, 2021 11:48 am
Follow us on


ఏపీలో పంచాయతీ పోరు నడుస్తోంది. మొదటి విడత నామినేషన్లు.. విత్‌డ్రా ప్రాసెస్‌ ఇప్పటికే పూర్తయింది. రేపు మొదటి విడత పోలింగ్‌ జరగబోతోంది. ఈ మేరకు ఏర్పాట్లలో అధికార యంత్రాంగం బిజీ అయింది. ఒంగోలు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 192 గ్రామ పంచాయతీ సర్పంచులు, 1417 వార్డు సభ్యుల పదవులకు పోలింగ్‌ ఉదయం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3.30 వరకూ కొనసాగుతుంది. ఇందుకు అధికారులు 2,365 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Also Read: టీడీపీ నిధుల వేట..: ముందుకు రాని క్యాడర్‌‌

ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. తొలి విడత ఒంగోలు రెవెన్యూ డివిజన్‌లో ఉన్న 14 మండలాల్లోని 227 గ్రామ పంచాయతీలు, వాటి పరిధిలోని 2,324 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చారు. నామినేషన్ల ఉపసంహరణల అనంతరం 35 గ్రామ పంచాయతీ సర్పంచ్‌, 907 మంది వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన వాటికి మంగళవారం పోలింగ్‌ జరగనుంది. సర్పంచుల స్థానానికి 511 మంది, వార్డు సభ్యుల పదవుల కోసం 3,003 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల నుంచి పోలింగ్‌ జరిగే పంచాయతీలకు సోమవారం సామగ్రిని, సిబ్బందిని తరలించనున్నారు. ఎన్నికలు జరిగే పంచాయతీలకు 83 రూట్లుగా విభజించి ప్రతి రూట్‌కు ఒక ఆఫీసర్‌ను ఏర్పాటు చేశారు. పర్యవేక్షణకు 35 మంది జోనల్‌ ఆఫీసర్లను నియమించారు. సామగ్రిని, సిబ్బందిని తరలించేందుకు 140 ప్రత్యేక బస్సులు, 83 కార్లు, జీపులను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ నిర్వహణకు 7,213 మంది సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నారు. స్టేజ్‌-–1 ఆర్వోలు 80 మంది, స్టేజ్‌–-2 ఆర్వోలు 229 మంది, జోనల్‌ ఆఫీసర్లు 35 మంది, రూట్‌ ఆఫీసర్లు 83 మంది, మైక్రో అబ్జర్వర్లు 385 మంది, పీఓలు, 3,173 మంది, ఓపీవోలు 4,581 మందిని నియమించారు.

Also Read: విశాఖ స్టీల్ ప్లాంట్ పై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

మొదటి విడత పోలింగ్‌ జరిగే పంచాయతీల్లో 172 కేంద్రాలు తీవ్ర సమస్యాత్మకంగా, 177 సమస్యాత్మకమైనవిగా, 297 సాధారణ సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో పోలీసు శాఖ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వాటిపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పోలింగ్‌ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వీడియో చిత్రీకరణను ఏర్పాటు చేశారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్