https://oktelugu.com/

వాహనదారులకు శుభవార్త.. టెస్టు లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ వాహనదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో కీలక మార్పులు చేయడానికి కేంద్రం సిద్ధమైంది. వాహనదారులు ఇకపై ఆన్ లైన్ లో నమోదు చేసుకోకుండానే లైసెన్స్ ను పొందే అవకాశం ఉంటుంది. డ్రైవింగ్ స్కూళ్లలో డ్రైవింగ్ నేర్చుకోవడం ద్వారా లైసెన్స్ ను పొందవచ్చు. Also Read: కేంద్రం శుభవార్త.. కారును తుక్కు చేస్తే కొత్త‌కారుపై డిస్కౌంట్‌..! కేంద్రం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 8, 2021 / 12:02 PM IST
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ వాహనదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో కీలక మార్పులు చేయడానికి కేంద్రం సిద్ధమైంది. వాహనదారులు ఇకపై ఆన్ లైన్ లో నమోదు చేసుకోకుండానే లైసెన్స్ ను పొందే అవకాశం ఉంటుంది. డ్రైవింగ్ స్కూళ్లలో డ్రైవింగ్ నేర్చుకోవడం ద్వారా లైసెన్స్ ను పొందవచ్చు.

    Also Read: కేంద్రం శుభవార్త.. కారును తుక్కు చేస్తే కొత్త‌కారుపై డిస్కౌంట్‌..!

    కేంద్రం డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఒక కొత్త స్కీమ్ ను అమలులోకి తీసుకురానుందని తెలుస్తోంది. కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డ్రైవింగ్ లైసెన్స్ జారీకి సంబంధించి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానుంది. ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నుంచి ఒక ముసాయిదా నోటిఫికేషన్ విడుదలైంది. లైసెన్స్ కావాలనుకునే వారికి కేంద్రం అమలులోకి తీసుకురాబోతున్న కొత్త నిబంధనలు ప్రయోజనం చేకూరుస్తున్నాయని చెప్పవచ్చు.

    Also Read: రోజుకు రూ.195 ఆదా చేస్తే కొత్త కారు.. ఎలా అంటే..?

    కేంద్ర ప్రభుత్వం మొదట దేశంలోని డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలను గుర్తించి ఆ డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు నిబంధనలను పాటించే విధంగా చర్యలు చేపడుతోంది. ఈ డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలలో నాణ్యతతో కూడిన డ్రైవింగ్ శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో ముసాయిదా నోటిఫికేషన్ అప్ లోడ్ కాగా మనం కూడా మన సలహాలను ఇవ్వవచ్చు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    కేంద్రం డ్రైవింగ్ స్కూళ్లకు అక్రిడిటేషన్ కొరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ శిక్షణా కేంద్రాల్లో శిక్షణ పూర్తి చేసుకుంటే డ్రైవింగ్ టెస్టు లేకుండా లైసెన్స్ ను పొందవచ్చు. కేంద్రం ఈ నిర్ణయం ద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని భావిస్తోంది.