Delhi: కొత్త చట్టాలు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. ఈ చట్టాల ప్రకారం ఢిల్లీ వీధి వ్యాపారులపై కొత్త క్రిమినల్ కింద మొట్టమొదటి కేసు నమోదైంది. ఆదివారం రాత్రి పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బంది రోడ్డుపై వాటర్ బాటిళ్లు, గుడ్కా విక్రయిస్తున్న వీధి వ్యాపారిని గుర్తించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
అమలులోకి న్యాయ్ సంహిత..
దేశవ్యాప్తంగా కొత్త క్రిమినల్ కోడ్ భారతీయ న్యాయ్ సంహిత సోమవారం(జూలై 1) నుంచి అమలులోకి వచ్చింది. కొత్త చట్టం ప్రకారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో రహదారిని అడ్డుకున్నందుకు వీధి వ్యాపారం చేస్తున్నవారిపై మొదటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కొత్త క్రిమినల్ కోడ్ సెక్షన్ 285 ప్రకారం ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ‘ఎవరైనా ఏదైనా చర్య చేయడం ద్వారా లేదా అతని ఆధీనంలో ఉన్న ఏదైనా ఆస్తిపై ఆర్డర్ తీసుకోకుండా వదిలివేయడం ద్వారా లేదా అతని ఆధీనంలో ఏదైనా వ్యక్తికి ప్రమాదం, ఆటంకం లేదా గాయం కలిగిస్తుంది. ఏదైనా పబ్లిక్ మార్గం లేదా నావిగేషన్ యొక్క పబ్లిక్ లైన్ , జరిమానాతో శిక్షించబడుతుంది, అది ఐదు వేల రూపాయల వరకు పొడిగించబడుతుంది.
పెట్రోలింగ్ పోలీసులు ఫస్ట్ కేసు..
ఆదివారం రాత్రి పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బంది రోడ్డుపై వాటర్ బాటిళ్లు, గుట్కా విక్రయిస్తున్న వీధి వ్యాపారిని గుర్తించారు. కొత్త క్రిమినల్ కోడ్ ప్రకారం దేశంలోనే మొట్ట మొదటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వీధి వ్యాపారి తాత్కాలిక దుకాణం రహదారికి అడ్డుగా ఉంది. తానిని తొలగించమని పోలీసులు సూచించారు. వ్యాపారి పట్టించుకోకపోవడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసు సిబ్బంది కదిలారు.
ఎఫ్‌ఐఆర్‌లో ఇలా..
ఎఫ్‌ఐఆర్ కాపీ ప్రకారం.. న్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద వీధి వ్యాపారి తన స్టాల్‌ను ఆదివారం అర్ధరాత్రి నిలిపి ఉంచాడని పేర్కొన్నారు. ‘వ్యక్తి వీధిలో నీరు, బీడీ, సిగరెట్లను విక్రయిస్తున్నాడు, అడ్డుకోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రోడ్డు నుంచి స్టాల్ తొలగించమని సబ్–ఇన్‌స్పెక్టర్ చాలాసార్లు కోరాడు, అతను అంగీకరించలేదు. సబ్–ఇన్‌స్పెక్టర్ చాలా మంది బాటసారులను విచారణలో చేరమని అడిగారు. అయినా వ్యాపారి నిరాకరించారు. దీంతో సబ్–ఇన్‌స్పెక్టర్ ఇ–ప్రమాణ్ అప్లికేషన్ ఉపయోగించి వీడియో చిత్రీకరించారు’ అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.