https://oktelugu.com/

రూట్‌ మార్చిన చంద్రబాబు: టార్గెట్‌ 2024.. ఏంటా కథ?

విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మొదటి సీఎంగా చంద్రబాబు అధికారం చేపట్టారు. ఆయనకు ఉన్న అనుభవం.. ఆయనపై ఉన్న నమ్మకంతో ప్రజలు సీఎం పదవిని కట్టబెట్టారు. కానీ.. ఆ ఐదేళ్లలో ఆయన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. దీంతో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూశారు. అప్పటి పార్టీ రోజురోజుకూ తుడిచిపెట్టుకుపోతూనే ఉంది. Also Read: ఫైర్‌‌బ్రాండ్లను పక్కనపెట్టినట్లేనా..? అయితే.. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పటిష్టం చేసి.. ఎలాగైనా 2024 లో మళ్లీ అధికారం చేపట్టాలని వ్యూహాలు రచిస్తున్నారట […]

Written By:
  • NARESH
  • , Updated On : October 19, 2020 / 10:45 AM IST
    Follow us on

    విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మొదటి సీఎంగా చంద్రబాబు అధికారం చేపట్టారు. ఆయనకు ఉన్న అనుభవం.. ఆయనపై ఉన్న నమ్మకంతో ప్రజలు సీఎం పదవిని కట్టబెట్టారు. కానీ.. ఆ ఐదేళ్లలో ఆయన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. దీంతో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూశారు. అప్పటి పార్టీ రోజురోజుకూ తుడిచిపెట్టుకుపోతూనే ఉంది.

    Also Read: ఫైర్‌‌బ్రాండ్లను పక్కనపెట్టినట్లేనా..?

    అయితే.. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పటిష్టం చేసి.. ఎలాగైనా 2024 లో మళ్లీ అధికారం చేపట్టాలని వ్యూహాలు రచిస్తున్నారట చంద్రబాబు. ఓ వైపు బలంగా ఉన్న అధికార పక్షం.. మరోవైపు వెంటాడుతున్న వృద్ధాప్యం ఆయ‌నను క‌ల‌వ‌రానికి గురిచేస్తున్నాయి. ఒకవేళ 2024లో టీడీపీని అధికారంలోకి తీసుకురాలేక పోతే.. ఇక పార్టీ క‌నుమ‌రుగ‌వుతుందని చంద్రబాబు ఆందోళ‌న‌లో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పార్టీని గెలుపు తీరాల‌కు తీసుకెళ్లేందుకు త‌న ప్రధాన ప్రత్యర్థి వైఎస్ జ‌గ‌న్‌ను చంద్రబాబు అనుస‌రించ‌క త‌ప్పడం లేదు. అందుకే.. టీడీపీ వ్యూహ‌క‌ర్తగా పంజాబ్‌కు చెందిన రాబిన్‌శ‌ర్మను నియిమించినట్లు స‌మాచారం.

    ఇప్పటికే రాబిన్‌శ‌ర్మ టీం క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగిన‌ట్టు వార్తలు కూడా వస్తున్నాయి. గ‌త ఎన్నికల వేళ వైసీపీ వ్యూహ‌క‌ర్తగా బిహార్‌కు చెందిన ప్రశాంత్ కిశోర్‌ను నియ‌మించుకున్నారు. కానీ.. ఇదే చంద్రబాబు ఆయనను తీవ్రంగా విమర్శించారు. ప్రశాంత్ కిశోర్‌ను ‘బిహార్‌ బందిపోటు దొంగ’గా పోల్చారు. ఇప్పుడు అదే బందిపోటు దొంగ టీంలో క్రియాశీల‌క పాత్ర పోషించిన పంజాబ్‌కు చెందిన రాబిన్‌శ‌ర్మను నియ‌మించుకోవ‌డంపై సెటైర్లు వినిపిస్తున్నాయి. 40 ఏళ్ల సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్రబాబు వ్యూహాలు, ఎత్తుగ‌డ‌లు.. జ‌గ‌న్ రాజ‌కీయాల ముందు తేలిపోతున్నాయని పలువురు బహిరంగంగానే అంటున్నారు.

    Also Read: జగన్‌ కేబినెట్‌ నుంచి కొందరు ఇన్‌.. మరికొందరు ఔట్‌..?

    రాష్ట్ర రాజకీయాల్లో రోజురోజుకూ వేగంగా మారుతున్న పరిణామాలను చంద్రబాబు అంత ఈజీగా అంచనా వేయలేకపోతున్నారు. ఇన్ని రోజులు ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని రాజకీయాలు నడిపించిన బాబు.. ఇక ఆ పద్ధతికి స్వస్తి పలకాలనుకున్నారు. అందుకే క్షేత్రస్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు ఓ వ్యూహ‌క‌ర్త అవ‌స‌ర‌మ‌ని భావించారు. ఈ నేప‌థ్యంలో రాబిన్‌శ‌ర్మను నియ‌మించుకోవడం గమనార్హం.