https://oktelugu.com/

వివేకా హత్య కేసులో కీలక మలుపు… ఆ పంచాయతీ హత్యకు కారణమా..?

  2019 సార్వత్రిక ఎన్నికలకు రెండు నెలల ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సంగతి తెలిసిందే. వివేకా హత్యతో రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. వివేకా హత్య కేసును సీబీఐకు అప్పగించినా ఇప్పటివరకు అసలు దోషులెవరో తేలలేదు. సీబీఐ అధికారులు ఈ కేసులో పదుల సంఖ్యలో అనుమానితులను, వివేకా కుటుంబ సభ్యులను, సన్నిహితులను విచారించినా హత్యకు కారణం ఎవరో కనుక్కోలేకపోయారు. Also Read : ఏపీలో పదో తరగతి చదివిన విద్యార్థులకు జగన్ సర్కార్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 24, 2020 / 08:09 AM IST
    Follow us on

     

    2019 సార్వత్రిక ఎన్నికలకు రెండు నెలల ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సంగతి తెలిసిందే. వివేకా హత్యతో రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. వివేకా హత్య కేసును సీబీఐకు అప్పగించినా ఇప్పటివరకు అసలు దోషులెవరో తేలలేదు. సీబీఐ అధికారులు ఈ కేసులో పదుల సంఖ్యలో అనుమానితులను, వివేకా కుటుంబ సభ్యులను, సన్నిహితులను విచారించినా హత్యకు కారణం ఎవరో కనుక్కోలేకపోయారు.

    Also Read : ఏపీలో పదో తరగతి చదివిన విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త..!

    అయితే గత కొన్ని రోజులుగా సీబీఐ ఈ కేసు విషయంలో దూకుడు పెంచింది. ఇందులో భాగంగా పలువురిని అరెస్ట్ చేస్తోంది. సీబీఐ అధికారులు యురేనియం కర్మాగారంలో ఉద్యోగిగా పని చేస్తున్న ఎంపీ అవినాష్ రెడ్డి సన్నిహితుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో పాటు అతని ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. పులివెందులలోని చెప్పుల షాపు యజమాని మున్నాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.

    అధికారులు అతని బ్యాంక్ లాకర్ లో 48 లక్షల రూపాయల నగదు, 25 తులాల బంగారం గుర్తించారు. అతనికి వేర్వేరు బ్యాంకులలో 20 లక్షల రూపాయల ఫిక్సుడ్ డిపాజిట్లు ఉన్నట్టు గుర్తించారు. వైఎస్ వివేకా భార్యాభర్తల వివాదానికి సంబంధించి మున్నాను మందలించాడని తెలుస్తోంది. మున్నా ముగ్గురు మహిళలను వివాహం చేసుకోగా ఆ వివాదం విషయంలో వివేకా మున్నాపై సీరియస్ అయినట్టు సమాచారం. ఈ పంచాయతీనే వివేకా హత్యకు కారణం కావచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    గతేడాది మార్చి 15న వివేకా హత్య జరగగా వివేకా హత్య కేసు విషయంలో టీడీపీ, వైసీపీ ఒకదానిపై ఒకటి విమర్శలు చేసుకున్నాయి. అప్పటి టీడీపీ సర్కార్ సిట్ ను ఏర్పాటు చేసినా నిందితులను మాత్రం కనిపెట్టలేకపోయింది. అనంతరం వివేకా కూతురుతో పాటు పలువురు ముఖ్యనేతలు హైకోర్టును ఆశ్రయించటంతో హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ఇప్పటికైనా ఈ కేసు విషయంలో అసలు దోషులు వెలుగులోకి వస్తారో లేదో చూడాల్సి ఉంది.

    Also Read : టీడీపీకి షాక్‌ తగలనుందా..?