వరుస ప్రమాదాలతో విశాఖ ఉక్కిరి బిక్కిరి!

ఇటీవల విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీలో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన మరువకముందే.. మరో ఘటనతో విశాఖ న‌గ‌ర‌వాసుల‌తోపాటు ప‌రిస‌ర‌ప్రాంతాల్లో ఉన్న వారికి కంటిపై కునుకు లేకుండా పోయింది. తాజాగా పరవాడలో రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్‌ లో భారీ పేలుడు సంభవించింది. ఒక వైపు క‌రోనా మ‌రో వైపు త‌రుచుగా జ‌రుగుతున్న ప్రమాదాలతో విశాఖ వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గ‌త కొద్ది కాలంగా విశాఖ‌ప‌ట్నంలో ఇలాంటి భ‌యాన‌క ప్రమాదాలు ఎందుకు సంభ‌విస్తున్నాయనే చర్చ మొదలైంది. ఎల్జీ […]

Written By: Neelambaram, Updated On : July 14, 2020 4:49 pm
Follow us on

ఇటీవల విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీలో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన మరువకముందే.. మరో ఘటనతో విశాఖ న‌గ‌ర‌వాసుల‌తోపాటు ప‌రిస‌ర‌ప్రాంతాల్లో ఉన్న వారికి కంటిపై కునుకు లేకుండా పోయింది. తాజాగా పరవాడలో రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్‌ లో భారీ పేలుడు సంభవించింది. ఒక వైపు క‌రోనా మ‌రో వైపు త‌రుచుగా జ‌రుగుతున్న ప్రమాదాలతో విశాఖ వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గ‌త కొద్ది కాలంగా విశాఖ‌ప‌ట్నంలో ఇలాంటి భ‌యాన‌క ప్రమాదాలు ఎందుకు సంభ‌విస్తున్నాయనే చర్చ మొదలైంది. ఎల్జీ పాలిమర్స్‌ ప్రమాదంతో మొదలైన ఈ ప్రమాదాల పరంపరపై నిపుణులు విశ్లేషణ మొదలైంది. అసలు ఈ ప్రమాదాలకు కారణమేంటి ? మాన‌వ త‌ప్పిదాలే కార‌ణ‌మా? విశాఖ జిల్లా వ్యాప్తంగా దాదాపు 9 అత్యంత ప్రమాదరకమైన ర‌సాయ‌న పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల వల్ల ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొండపల్లి, జి.కొండూరు,ఇబ్రహీంపట్నం మండలాలలోని గ్రామాల్లో దాదాపు 1500 ఎకరాల్లో బీపీసీఎల్‌ ఆయిల్‌, ఐవోసీఎల్‌ ఆయిల్‌, హెచ్‌పీసీఎల్‌ ఆయిల్‌, హెచ్‌పీసీఎల్‌ బాట్లింగు ప్లాంటు, బీపీసీఎల్‌ బాట్లింగు ప్లాంటు, ల్యాంకో పవర్‌, ఎన్‌టీటీపీఎస్‌, గెయిల్‌ ఇండియా ఇలా పదుల సంఖ్యలో అత్యంత ప్రమాదకరమైన కంపెనీలు ఉన్నాయి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న ఘోరమైన ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి.

అతిగా శానిటైజర్ వాడితే అనర్థమేనంటా..!

ఇంత‌టి ప్రమాదకరమైన పరిశ్రమలు ఉన్నా.. వాటి భద్రత పర్యవేక్షణపై ప్రభుత్వం ఇప్పటివరకు ఒక క‌మిటిని కూడా వేయ‌లేదు. గ‌తంలో ఉన్న ప్రభుత్వం కూడా వీటిలో భద్రత ప్రమాణాలు ఎంత వ‌ర‌కు ఉన్నాయ‌నే విష‌యాల‌పై పెద్దగా దృష్టి పెట్టలేదు. వైఎస్ జగన్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం త‌రువాత ఒక్కసారిగా ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఏ కంపెనీల వ‌ల‌న అయితే ఎక్కువ ప్రమాదాలు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయో ఆ కంపెనీలను ఆన్ సైట్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించాయి. ఆ ఆన్ సైట్ యాక్షన్ ప్లాన్ అమ‌లు చేసే బాధ్యతను కూడా ఆ కంపెనీల‌కే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పటివరకు అది అమల్లోకి రాలేదు.

ఏపీ, తెలంగాణ కి అప్పుల తిప్పలు!

దీంతోపాటు కంపెనీల యాజ‌మాన్యాల నిర్లక్ష్యం కూడా త‌రుచుగా ప్రమాదాలు సంభవించడానికి కార‌ణంగా తెలుస్తోంది. దాదాపు రెండు నెల‌ల లాక్ డౌన్ స‌మ‌యంలో అన్ని కంపెనీలు కూడా మూత‌ప‌డ్డాయి. ఆ సమ‌యంలో కంపెనీల్లో పర్యవేక్షణ కరువవడం కూడా ఈ వ‌ర‌స ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం విష‌యంలో ఇదే మ‌న‌కు స్పష్టమైంది. ప్రభుత్వం లాక్ డౌన్ స‌మ‌యంలో కంపెనీ పర్యవేక్షణ కోసం ఉద్యోగుల‌కు ప్రత్యేక అనుమతులు ఇచ్చినా కంపెనీ యాజ‌మాన్యం నిర్లక్ష్య దోర‌ణితో దాదాపు 12 మందిని పొట్టనబెట్టుకుంది. లాక్ డౌన్ విధించిన‌ప్పుడు ఎటువంటి ప్లానింగ్ లేదో లాక్ డౌన్‌ ను స‌డ‌లించిన‌ప్పుడు కూడా ప్రభుత్వాలు అటువంటి జాగ్రత్తలు తీసుకోవక‌పోవ‌డమే కార‌ణంగా కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఫ్రభుత్వాలు కూడా ఏదైనా సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు హ‌డావిడి చేయ‌డం… త‌రువాత క్రమేపి వాటిని ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల‌న ఇలాంటి ప్రమాదాలకు కార‌ణ‌మ‌వుతుంది. వాస్తవానికి భోపాల్ ఘ‌ట‌న త‌రువాత ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చినా… వాటిని క్షేత్రస్థాయిలో అమ‌లు మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది.