https://oktelugu.com/

రైతుబంధుకు ఖజానా కష్టాలు

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకం అమలు చేస్తోంది. రెండు సారి అధికారంలోకి రావడానికి టీఆర్‌‌ఎస్‌కు కలిసివచ్చిన అంశం కూడా రైతుబంధునే. ఎన్నికల సమయంలో పంపిణీ చేయడంతో వాటిని తీసుకున్న ఆనందంలో రైతులు టీఆర్ఎస్‌కు ఓట్లేశారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ పథకం అమలులో ఆలస్యం జరుగుతోంది. యాసంగి ప్రారంభమైన తర్వాత రెండు నెలలకు రైతు బంధు సాయం అందిస్తున్న కేసీఆర్ సర్కార్.. విడుతల వారీగా పంపిణీ చేస్తోంది. Also Read: సీమ రక్త […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 29, 2020 / 12:36 PM IST
    Follow us on


    తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకం అమలు చేస్తోంది. రెండు సారి అధికారంలోకి రావడానికి టీఆర్‌‌ఎస్‌కు కలిసివచ్చిన అంశం కూడా రైతుబంధునే. ఎన్నికల సమయంలో పంపిణీ చేయడంతో వాటిని తీసుకున్న ఆనందంలో రైతులు టీఆర్ఎస్‌కు ఓట్లేశారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ పథకం అమలులో ఆలస్యం జరుగుతోంది. యాసంగి ప్రారంభమైన తర్వాత రెండు నెలలకు రైతు బంధు సాయం అందిస్తున్న కేసీఆర్ సర్కార్.. విడుతల వారీగా పంపిణీ చేస్తోంది.

    Also Read: సీమ రక్త చరిత్రలోనే ఆసక్తికర సీన్?

    తాజాగా.. రూ.ఏడున్నర వేల కోట్లను రైతుబంధు కోసం విడుదల చేశామని ఆదివారం నాటి సమీక్షలో కేసీఆర్ ప్రకటించారు. సోమవారం నుంచి విడుదల చేస్తామన్నారు. అంటే.. విడుదల చేస్తూ వెళ్తారన్నమాట. సోమవారం ఒక్క ఎకరం ఉన్న రైతులకు మాత్రమే ఈ సాయం అందిస్తున్నారు. ఒక్కొక్కరికి రూ. 5 వేలు జమ అయినట్లుగా తెలుస్తోంది. అది కూడా అందరికీ జమ కాలేదని.. ఇంకా కొంత మందికి పెండింగ్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. మంళవారం రెండు ఎకరాలు ఉన్న రైతులకు జమ చేస్తారని చెబుతున్నారు. ఇలా పెంచుకుంటూ.. ఇచ్చుకుంటూ పోతారని అంటున్నారు.

    ఇప్పటికే యాసంగి ప్రారంభం కావడం.. ఇప్పడిప్పుడు ప్రభుత్వం రైతుబంధు అందిస్తుండడం.. అది కూడా వాయిదాల పద్ధతిలో ఇస్తుండడంతో రైతుల్లో అసహనానికి కారణం అవుతోంది. ఏపీ సర్కార్ అనేక సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి మీట నొక్కి విడుదల చేస్తుంటారు. అలా కేసీఆర్ కూడా ఒకేసారి లబ్ధిదారుల అకౌంట్లలో నగదు జమ చేయాలని వారు కోరుకుంటున్నారు. కానీ.. ఆర్థిక కష్టాలతో ఎప్పటికప్పుడు నగదును సర్దుబాటు చేస్తూ రైతుబంధు నిధులు చెల్లిస్తున్నారని.. ఒకేసారి జమ చేయడం సాధ్యం కాదన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో నడుస్తోంది.

    Also Read: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం..!

    తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలకు కూడా ఇప్పుడు ఖజానా లేక అమలు చేయడంలో కకావికలం అవుతోంది. ఇప్పటికే కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. మరోవైపు సర్కార్‌‌ తలతిక్క నిర్ణయంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దాంతో కూడా రాబడి పడిపోయింది. ఇప్పుడు రాష్ట్రం కాస్త అప్పులకుప్ప అయింది. వీటన్నింటి నేపథ్యంలో ఏ స్కీమ్‌ రన్‌ చేయాలన్నా అప్పు చేయాల్సిన దుస్థితే వచ్చింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్