https://oktelugu.com/

మహేష్ బాబు కోసం నలుగురి మధ్య పోటీ !

సూపర్ స్టార్ మహేష్ కోసం ప్రస్తుతం నలుగురు డైరెక్టర్లు పోటీ పడుతున్నారు. కానీ మహేష్ ఎవరికీ డేట్స్ ఇస్తాడా అనేదే చూడాలి. ముందుగా భీష్మ సినిమాతో తన ఖాతాలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న వెంకీ కుడుముల, మహేష్ కోసం ఒక కథ రాసాడు. పైగా ఫుల్ స్క్రిప్ట్ ను మహేష్ కి చెప్పాడని.. మహేష్ కూడా దాదాపు సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని.. కాకపోతే ఎప్పుడు చేద్దామనేది మహేష్ క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది. అలాగే మరో సీనియర్ […]

Written By:
  • admin
  • , Updated On : December 29, 2020 / 12:21 PM IST
    Follow us on


    సూపర్ స్టార్ మహేష్ కోసం ప్రస్తుతం నలుగురు డైరెక్టర్లు పోటీ పడుతున్నారు. కానీ మహేష్ ఎవరికీ డేట్స్ ఇస్తాడా అనేదే చూడాలి. ముందుగా భీష్మ సినిమాతో తన ఖాతాలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న వెంకీ కుడుముల, మహేష్ కోసం ఒక కథ రాసాడు. పైగా ఫుల్ స్క్రిప్ట్ ను మహేష్ కి చెప్పాడని.. మహేష్ కూడా దాదాపు సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని.. కాకపోతే ఎప్పుడు చేద్దామనేది మహేష్ క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది. అలాగే మరో సీనియర్ డైరెక్టర్ కూడా మహేష్ కోసం పోటీ పడుతున్నాడు. ఒక్కడు సినిమాతో మహేష్ బాబు కెరీర్ కు మరచిపోలేని క్రేజ్ అందించిన గుణశేఖరే ఆ సీనియర్ డైరెక్టర్.

    Also Read: అఖిల్‌ కనిపించడే..?

    నిజానికి గుణశేఖర్ ఆ తరువాత అర్జున్, సైనికుడు సినిమాలు చేశారు కానీ అవి భారీ ప్లాప్స్ గా నిలిచిపోయాయి. అయితే ఇక మధ్య మధ్యలో మహేష్ బాబుతో సినిమా చేయాలని గుణశేఖర్ ప్రయత్నం చేసినప్పటికీ మహేష్ నో చెప్పాడు. మళ్లీ ఇప్పుడు గుణశేఖర్, మహేష్ కి ఇంకో కథ చెప్పాడట. మరి మహేష్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి. అలాగే మరొక దర్శకుడు శ్రీను వైట్ల పరిస్థితి కూడా అలానే ఉంది. మహేష్ బాబుతో దూకుడు సినిమా చేసి బాక్సాఫీస్ హిట్ అందుకున్న తరువాత దూకుడు సినిమాతో డిజాస్టర్ తీశాడు. చాలా కాలం తరువాత మరో సినిమా చేయాలని ట్రై చేస్తున్నా మహేష్ పెట్టించుకోవట్లేదు.

    Also Read: ఫ్రీ సమ్మర్ లో నితిన్ ‘చెక్’.. అలాగే బోల్డ్ సినిమా కూడా !

    ప్రస్తుతం మంచు విష్ణుతో మరో ఢీ లాంటి సినిమా చేస్తున్న శ్రీను వైట్ల ఎలాగైనా ఆ సినిమా అయిపోక ముందే మహేష్ తో ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకోవడానికి కథ చెబుతా అని తిరుగుతున్నాడాట. అలాగే వంశీ పైడిపల్లి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తన తరువాత సినిమాని ప్లాన్ చేశాడని గతంలో కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఈ వార్తే రావడంతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి రాజమౌళి కంటే ముందే గ్యాప్ దొరకడంతో మహేష్ తో సినిమా చేయడానికి ఈ నలుగురు డైరెక్టర్లు పోటీ పడుతున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్