https://oktelugu.com/

రైతుల కోసం దేవుడితోనైనా కొట్లాడుతా: కేసీఆర్ సంచలనం

రైతుల ఉసురు తీసేలా కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులు, విద్యుత్ బిల్లులు ఉన్నాయని ఇది వరకు విమర్శలు గుప్పించిన సీఎం కేసీఆర్ తాజాగా రైతుల కోసం దేనికైనా సిద్ధమని ప్రకటించారు.రైతుల రక్షణ కోసం వ్యవసాయం బాగు కోసం అవసరమైతే ఆ దేవుడితోనైనా కొట్లాటకు సిద్ధమని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈనెల 6న ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలపై అపెక్స్ కౌన్సిల్ భేటి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనుసరించాల్సిన వ్యూహంపై నీటిపారుదల శాఖ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 1, 2020 / 09:00 PM IST
    Follow us on

    రైతుల ఉసురు తీసేలా కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులు, విద్యుత్ బిల్లులు ఉన్నాయని ఇది వరకు విమర్శలు గుప్పించిన సీఎం కేసీఆర్ తాజాగా రైతుల కోసం దేనికైనా సిద్ధమని ప్రకటించారు.రైతుల రక్షణ కోసం వ్యవసాయం బాగు కోసం అవసరమైతే ఆ దేవుడితోనైనా కొట్లాటకు సిద్ధమని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

    ఈనెల 6న ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలపై అపెక్స్ కౌన్సిల్ భేటి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనుసరించాల్సిన వ్యూహంపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు.

    ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నీళ్లతో ముడిపడే తెలంగాణ ఉద్యమం సాగిందని.. ఇప్పుడు సాగునీటి రంగం బలోపేతమై దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని.. గోదావరి కృష్ణా నదుల్లో మనకు హక్కుగా వచ్చే ప్రతి చుక్కను వాడుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. అపెక్స్ కౌన్సిల్ భేటిలో రాష్ట్రం తరుఫున బలంగా వాదనలు వినిపించాలని కేసీఆర్ అన్నారు.

    కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ కడిగేశారు. కేంద్రం చర్యలు, అలసత్వంతో వ్యవహరిస్తోందంటూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ విమర్శించారు. అపెక్స్ కమిటీ భేటిలో ఏపీకి ధీటుగా బదులివ్వాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. నదీజలాల విషయంలో ఏపీ కావాలనే కయ్యం పెట్టుకుందని కేసీఆర్ అన్నారు.