https://oktelugu.com/

రంజుగా అరకు రాజకీయం..!

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతీ పార్లమెంట్ నియోజకర్గ కేంద్రాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈమేరకు ప్రభుత్వం సీఎస్ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి కొత్త జిల్లాల ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఆయా జిల్లాలోని రెవిన్యూ అధికారులతో అధికారులు సమీక్షలు నిర్వహించి ఇప్పటికే ప్రభుత్వం అన్ని మండలాలకు సంబంధించిన నివేదికలను తెప్పించుకుంది. ఆయా జిల్లాలో వస్తున్న డిమాండ్ల మేరకు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 31, 2020 / 02:43 PM IST
    Follow us on


    ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతీ పార్లమెంట్ నియోజకర్గ కేంద్రాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈమేరకు ప్రభుత్వం సీఎస్ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి కొత్త జిల్లాల ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఆయా జిల్లాలోని రెవిన్యూ అధికారులతో అధికారులు సమీక్షలు నిర్వహించి ఇప్పటికే ప్రభుత్వం అన్ని మండలాలకు సంబంధించిన నివేదికలను తెప్పించుకుంది. ఆయా జిల్లాలో వస్తున్న డిమాండ్ల మేరకు ప్రభుత్వం జిల్లాల విభజన చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది.

    Also Read: టీడీపీకి మరో కోలుకోలేని షాక్‌

    కొత్త జిల్లాల తేనెతుట్టును జగన్ సర్కార్ కదపడంతో తమ నియోజకవర్గాన్ని జిల్లాగా చేయాలని పెద్దఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. అలాగే తమ ప్రాంతాన్ని ఇతర నియోజకవర్గాల్లో కలుపొద్దంటూ వ్యతిరేకతలు కూడా విన్పిస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి కొత్త సమస్యలు ఏర్పడేలా కన్పిస్తున్నాయి. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు కొందరి సంతోషాన్నిస్తుండగా మరికొందరికీ కంటగింపుగా మారుతోంది. ప్రతిపక్ష పార్టీల నేతలతోపాటు అధికార పార్టీల నేతలకు కొత్త జిల్లాల ఏర్పాటుతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

    డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి విన్నపం మేరకు అరకును కొత్త జిల్లాగా ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే అరకును రెండు జిల్లాలు విభజించాలనే ప్రతిపాదన కూడా ఉంది. అరకు విజయనగరంలో పరిధిలో ఉండటంతో ఈ ప్రాంతంలో మంత్రి బోత్స సత్యనారాయణ మంచిపట్టుంది. దీంతో కురుసాం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీవాణిపై బోత్స పైచేయి సాధిస్తూ వస్తున్నారు. అన్నివిషయాల్లో బోత్స కలుగజేసుకుండటంతో ఆమె ప్రాధాన్యత తగ్గుతుందని విజయసాయి గతంలో ఆవేదన చెందినట్లు సమాచారం.

    Also Read: జల వివాదాల పరిష్కారంపై ముఖం చాటేస్తున్న కేసీఆర్

    విజయనగరం అసెంబ్లీ పరిధిలోని పార్వతీపురం, కురుసాం, సాలురులు అరకులో కలువనున్నాయి. అరకు జిల్లాగా ఏర్పడితే ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీవాణి ఇక్కడ బలమైన నేతగా మారిపోనున్నారు. ఈ ప్రాంతంలో శ్రీవాణిని చెక్ పెట్టేందుకు బోత్స గతంలోనే టీడీపీకి చెందిన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శోభా స్వాతిరాణిని పార్టీలోకి తీసుకొచ్చారు. అరకు జిల్లా ఏర్పాటుతో బొత్స కేవలం విజయనగరం పరిధికే పరిమితం అవాల్సి ఉంటుంది. దీంతో శ్రీవాణికి బోత్స నుంచి అడ్డంకులు తొలిగిపోనున్నాయి. ఈ పరిణామం బోత్సకు కంటగింపుగా మారుతుండగా శ్రీవాణికి మాత్రం కలిసిరానుంది.