https://oktelugu.com/

టీడీపీ కోవర్టుల చీటీ చిరిగేలా ఉందే..!

టీడీపీకి అన్ని దారులు మూసుకుపోయిన వేళ, బీజేపీలో కొనసాగుతున్న ఆయన కోవర్టులకు కూడా గడ్డుకాలమే అన్నమాట గట్టిగా వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం తరువాత రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. గత నాలుగు రోజులుగా సోము వీర్రాజు వ్యాఖ్యలు, ముక్కుసూటి సమాధానాలు అధికార వైసీపీ కంటే టీడీపీని కలవరపెట్టేవిగా ఉండడం విశేషం. ఇక రాజధాని విషయంలో అయన వైఖరి వైసీపీ నిర్ణయానికి అనుకూలంగా ఉండగా, టీడీపీ గొంతులో పచ్చి వెలక్కాయ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 31, 2020 / 02:10 PM IST
    Follow us on


    టీడీపీకి అన్ని దారులు మూసుకుపోయిన వేళ, బీజేపీలో కొనసాగుతున్న ఆయన కోవర్టులకు కూడా గడ్డుకాలమే అన్నమాట గట్టిగా వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం తరువాత రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. గత నాలుగు రోజులుగా సోము వీర్రాజు వ్యాఖ్యలు, ముక్కుసూటి సమాధానాలు అధికార వైసీపీ కంటే టీడీపీని కలవరపెట్టేవిగా ఉండడం విశేషం. ఇక రాజధాని విషయంలో అయన వైఖరి వైసీపీ నిర్ణయానికి అనుకూలంగా ఉండగా, టీడీపీ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయ్యింది. రాష్ట్ర రాజధాని నిర్ణయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశమే అని ఆయన కుండబద్దలు కొట్టారు. దీనితో కనీసం కేంద్ర జోక్యంతో మూడు రాజధానుల ప్రతిపాదన అడ్డుకోవాలని చూసిన టీడీపీ ప్రభుత్వానికి చివరి ఆశకూడా ఆవిరైపోయింది.

    Also Read: కేశినేనిపై అసమ్మతి.. ఆయన కూతురే టార్గెట్..!

    కాగా సోమువీర్రాజు దూకుడు చూశాక, బీజేపీలో కొనసాగుతున్న టీడీపీ కోవర్టులకు కాలం చెల్లినట్లే అన్న వాదన వినిపిస్తుంది. కేంద్ర అనుమతి లేకుండా జగన్ రాజధానిని కదిలించలేరని సుజానా చౌదరి సవాలు చేసిన గంటల వ్యవధిలో సోము వీర్రాజు ఇచ్చిన స్టేట్మెంట్, బీజేపీలో సుజనా స్థానం ఏమిటో తెలియజేసింది. రాష్ట్రంలో వైసీపీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంతో చంద్రబాబుకు ఆర్థిక వనరులు సమకూర్చే రాజ్యసభ సభ్యులైన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ వంటి వాళ్ళని బాబు ముందు చూపుతో బీజేపీలోకి పంపించారు. బీజేపీలో వీరు చేరడానికి అసలు కారణాలు ప్రజలందరికీ తెలుసు. టీడీపీ ప్రభుత్వంలో వీరు చేసిన ఆర్థిక నేరాల చిట్టా బయటపడుతున్న క్రమంలో తమనుతాము కాపాడుకోవడానికి, టీడీపీకి కొమ్ముకాయడానికి బీజేపీ పంచన చేరారు.

    Also Read: నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం..!

    ఇక పార్టీ మారినా వీరి లక్ష్యాలు, ఆశించే ప్రయోజనాలు ఒకటే. చంద్రబాబు సంక్షేమమే ధ్యేయంగా వీరి రాజకీయం సాగింది. ముఖ్యంగా సుజనా చౌదరి బీజేపీలో ఉంటూ టీడీపీ గళం వినిపిస్తున్నారు. టీడీపీ అనుకూలుడుగా విమర్శలు ఎదుర్కొన్న కన్నా బీజేపీ రాష్ట్ర అధ్యాకుడిగా ఉన్నంత కాలం, సుజనా ఆరోపణలు, వ్యాఖ్యలకు బలం చేకూరింది. సోము వీర్రాజు రాక తరువాత ఆయన స్వరం, బీజేపీ స్వరం వేరుగా వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలు చూస్తుంటే బీజేపీలో ఉన్నప్పటికీ సుజనా, సీఎం రమేష్ వంటి నాయకుల ఆర్థిక నేరాలు బయటపెట్టే అవకాశం కలదన్న మాట వినిపిస్తుంది. వీరి అరెస్టులు కానీ జరిగితే చంద్రబాబు ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టినట్లు అవుతుంది. బాబుకు మాత్రం తాజా పరిణామాలు కునుకు లేకుండా చేస్తున్నాయి.