Head Consitable : కొద్దిసేపట్లో డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లవలసిన శ్రీదేవి అనే మహిళ హెడ్ కానిస్టేబుల్ మృత్యు ఒడిలోకి వెళ్ళింది. రామాలయం సమీపంలో ఉన్న డ్రైనేజీలో పడి శనివారం మధ్యాహ్నం ప్రాణాలు కోల్పోయింది, కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీదేవి ప్రాణాలు కోల్పోయింది.
కెటిఆర్ పర్యటనకు బందోబస్తుకు వచ్చిన ఆమె రామాలయం వద్ద వాహనాలు పార్కింగ్ చేసే స్థలం వద్ద నుంచి అన్నదాన సత్రం వైపు నడుచుకుంటూ వస్తుండగా డ్రైనేజ్ లో పడిపోయింది.
స్థానికుల సమాచారం ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్లోయిస్ గేట్ల వద్ద కానిస్టేబుల్ శ్రీదేవి మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మహిళ హెడ్ కానిస్టేబుల్ ఎందుకు ఈ కాలువలో పడిపోయింది? ఆమెకు ఏమైనా మూర్చ ఉందా? కారణాలు ఏంటన్నది తెలియాల్సి ఉంది.