దేశంలో రోజురోజుకు బంగారం ధరలు తగ్గిపోతున్నాయి. కేంద్రం బంగారంపై సుంకం తగ్గించడంతో బంగారు ఆభరణాల ధరలు తగ్గుతున్నాయని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం వరకు 10 గ్రాముల బంగారం ధర 50,000 రూపాయలకు అటూఇటుగా ఉండగా ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర 43,920 రూపాయలుగా ఉంది. గడిచిన వారం రోజుల నుంచి బంగారం ధరలు అంతకంతకూ తగ్గుతుండటం గమనార్హం.
ఏపీలోని విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 41,900 రూపాయలుగా ఉండటం గమనార్హం. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 44,050 రూపాయలుగా ఉండగా బెంగళూరు, విశాఖపట్నంలలో బంగారం ధర తక్కువగా ఉంది. బంగారం ధర మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బంగారం కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమని ఎక్కువ మొత్తం బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటే మాత్రం వేచి ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
బంగారం రేటు నేలచూపులు చూస్తుంటే వెండి ధర మాత్రం పైకి కదలడం గమనార్హం. కిలో వెండి ధర ఏకంగా 69,500 రూపాయలుగా ఉండటం గమనార్హం. పరిశ్రమ యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి వెండికి రోజురోజుకు డిమాండ్ పెరుగుతుండటంతో వెండి ధరలు పెరిగాయని తెలుస్తోంది. హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 330 రూపాయలు తగ్గింది.
ఏప్రిల్ నెలాఖరు వరకు ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని.. మే నెలలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన తరువాత ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయని సమాచారం. ద్రవ్యోల్బణం, పసిడి ధరలలో మార్పులతో పాటు ఇతర అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపే అవకాశాలు కూడా ఉంటాయి.