టాలీవుడ్ స్టార్ కపుల్ నాగ చైత్యన్య, సమంత పెళ్లి చేసుకొని కొన్ని రోజుల్లో నాలుగేళ్లు పూర్తి కావస్తుంది. 2017 జనవరిలో చైతూ-సామ్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గోవాలో గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకున్నారు ఈ జంట. సమంత మలయాళ క్రిస్టియన్ కావడంతో హిందూ మరియు క్రైస్తవ సాంప్రదాయాలలో వీరి వివాహం జరిగింది. నాలుగేళ్లుగా హ్యాపీ కపుల్ గా వైవాహిక జీవితం ఆనందిస్తున్నారు ఈ జంట.
Also Read: ఎవ్వరూ చేయలేని పని చేసిన ‘మెగాస్టార్’
పెళ్ళైనా కెరీర్ పరంగా ఎవరి నిర్ణయాలు వారివే. పెళ్లి తరువాత కూడా సమంత లైఫ్ స్టైల్ లో పెద్దగా వచ్చిన మార్పేమీ లేదు. ఎప్పటిలాగే ట్రెండీ డ్రెస్ లు, కమర్షియల్ చిత్రాలలో గ్లామర్ రోల్స్ చేసింది. పెళ్లి తరువాత సమంత తమిళ చిత్రం సూపర్ డీలక్స్ లో బోల్డ్ రోల్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. మిగతా పరిశ్రమల మాటేమో కానీ, గతంలో తెలుగు హీరోలను పెళ్లి చేసుకున్న నార్త్ అమ్మాయిలు కూడా పద్దతిగా మారిపోయారు. దానికి సమంత అత్తగారైన అమలనే నిదర్శనం.
ఆ విషయం పక్కన పెడితే పెళ్ళై నాలుగేళ్లు అవుతున్నా పిల్లలు కనాలనే ఆలోచన చేయడం లేదు ఈ జంట. పెళ్ళైన తరువాత ఒకటి రెండేళ్లు ఫ్యామిలీ ప్లానింగ్ పాటించడం ఎవరికైనా సహజమే. కానీ నాలుగేళ్లు అవుతున్నా, 30 ప్లస్ వయసులోకి ప్రవేశించినా సమంత, చైతూ ఫ్యాన్స్ కి ఆ శుభవార్త చెప్పడం లేదు. ఇటలీ, గోవా, మాల్దీవ్స్ టూర్స్ అంటూ జంటగానే ఎంజాయ్ చేస్తున్న ఈ స్టార్స్, తల్లిదండ్రులుగా మారే ప్రయత్నం చేయడం లేదు. స్టార్ హీరోయిన్ గా, అక్కినేని వారి కోడలిగా కోట్ల సంపాదన,వందల కోట్ల ఆస్తులు కలిగిన వీరికి…పిల్లలకు మించిన తాపత్రయం ఏమిటో అర్థం కావడం లేదు.
Also Read:మహేశ్‌బాబు ‘ఒక్కడు’ వెనుక ఇంత కథ ఉందా..!’
కెరీర్ పరంగా చూస్తే సమంత స్టార్ హీరోయిన్ గా అన్ని హైట్స్ చూసేశారు. సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ గా తిరుగులేని స్టార్ డమ్ సంపాదించారు. కమర్షియల్ హీరోయిన్ గా ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన సమంత, ఓ బేబీ, జాను, యూ టర్న్ వంటి చిత్రాల ద్వారా నటిగా కూడా నిరూపించుకున్నారు. అలాంటి సమంత తాజాగా హోస్ట్ గా మారారు. వీరితో పాటు పెళ్లి చేసుకున్న అనుష్క, విరాట్ సైతం తల్లిదండ్రులు కాబోతున్నారు. మరి సమంత ఇంకా తల్లి కాకపోవడం వెనుక ప్రయత్న లోపమా, ఫలితం రావడం లేదో అర్థం కావడం లేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్