రైతులపై యుద్ధం చేయబోతున్నారా..? ఏంటీ దారుణం..?

నూతన చట్టాలకు వ్యతిరేకంగా గత రెండు నెలలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. కేంద్రం నుంచి స్పందన కరువవుతున్న నేపథ్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా చక్కాజామ్ (రాస్తారోకో)లు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. గత నెల 26న జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు […]

Written By: Srinivas, Updated On : February 6, 2021 3:27 pm
Follow us on


నూతన చట్టాలకు వ్యతిరేకంగా గత రెండు నెలలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. కేంద్రం నుంచి స్పందన కరువవుతున్న నేపథ్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా చక్కాజామ్ (రాస్తారోకో)లు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. గత నెల 26న జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Also Read: సాగు చట్టాల వివాదం.. రైతులను అనలేక.. విదేశీమద్దతుదారులపై దాడులా..?

రైతులకు పోలీసులకు మధ్య మరోసారి యుద్ధం జరగకుండా.. ఢిల్లీలో గత ఘటన పునరావృతం కాకుండా ఢిల్లీ.. ఎన్సీఆర్ ప్రాంతంలో దాదాపు యాబైవేల మంది పోలీసులు , పారామిలటరీ సిబ్బంది మోహరించారు. రైతులు ఆందోళన చేస్తున్న సరిహద్దుల్లో డ్రోన్లతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా గాజీపూర్ సరిహద్దుల్లో మరిన్ని బారీకేట్లు ఏర్పాటు చేశారు. జల ఫిరంగులు సిద్ధంగా ఉంచారు. మొత్తంగా ఢిల్లీ సరిహద్దులు యుద్ద వాతావరణాన్ని తలపిస్తున్నాయి.

Also Read: మరో కొత్త వ్యూహాన్ని ఎంచుకున్న బీజేపీ..!

గణతంత్ర దినోత్సం రోజున రైతులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ఈ సారి అలాంటి ఘటనలు చోటు చేసుకుండా.. పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నారు. చారిత్రక ఎర్రకోట వద్ద భారీగా పోలీసులు మోహరించారు. చక్కా జామ్ దృష్ట్యా ఢిల్లీ వ్యాప్తంగా మెట్రోస్టేషన్లలో సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేస్తున్నట్లు.. అధికారులు వెల్లడించారు. అదే విధంగా అటు సింఘు, టిక్రీ సరిహద్దుల్లోనూ.. భారీగా భద్రతా బలగాలను మోహరించి పహారా కాయిస్తున్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయం పాలిటిక్స్

శనివారం మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు రైతులు రహదారులను దిబ్బంధనం చేయనున్నారు. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్లకు మినహాయింపును ఇస్తూ.. దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ఆందోళన చేపట్టనున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ నేతలు తెలిపారు. అంబులెన్సులు, పాఠశాల బస్సులు వంటి అత్యవసర తప్పనిసరి సేవలకు ఆటంకం కలిగించబోమని సంయుక్త కిసాన్ మోర్చా స్పష్టం చేసింది. చక్కాజామ్ ను పూర్తి శాంతియుతంగా నిర్వహిస్తామని ఎస్ కేఎం సీనియర్ నేత దర్శన్ పాల్ తో పాటు బీకేయూ నేత రాకేశ్ టికాయత్ వెల్లడించారు. సాయంత్రం మూడు గంటలకు చక్కాజామ్ ముగియగానే.. ఒక నిమిషం పాటు హారన్ మోగించనున్నట్లు రైతు నేతలు తెలిపారు. కాగా చక్కాజామ్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది.