ఇంటింటికి బియ్యం.. జగన్ కు కొత్త కష్టం

ఏపీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటింటికీ బియ్యం పథకం మూణ్నాళ్ల ముచ్చగా మారింది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పట్టణాలకే పరిమితమైన పథకం… అక్కడ కూడా నల్లేరుపై నడకలా తయారైంది ఏపీ ప్రభుత్వం పరిస్థితి. ఉపాధి కల్పించేందుకు ప్రయత్నించిన డ్రైవర్ల నుంచి మెప్పు రాకపోగా.. ఇంటింటికి వచ్చి బియ్యం ఇస్తారన్న ప్రజలనూ ఆకర్షించలేదు. ఈ మధ్యలో తమకు పనిలేకుండా చేశారని డీలర్లు ప్రభుత్వంపై కోపంగా ఉన్నారు. ఇంటింటికి బియ్యం పథకం.. జగను పాలనకు పెద్ద సమస్యనే […]

Written By: Srinivas, Updated On : February 6, 2021 1:59 pm
Follow us on


ఏపీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటింటికీ బియ్యం పథకం మూణ్నాళ్ల ముచ్చగా మారింది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పట్టణాలకే పరిమితమైన పథకం… అక్కడ కూడా నల్లేరుపై నడకలా తయారైంది ఏపీ ప్రభుత్వం పరిస్థితి. ఉపాధి కల్పించేందుకు ప్రయత్నించిన డ్రైవర్ల నుంచి మెప్పు రాకపోగా.. ఇంటింటికి వచ్చి బియ్యం ఇస్తారన్న ప్రజలనూ ఆకర్షించలేదు. ఈ మధ్యలో తమకు పనిలేకుండా చేశారని డీలర్లు ప్రభుత్వంపై కోపంగా ఉన్నారు. ఇంటింటికి బియ్యం పథకం.. జగను పాలనకు పెద్ద సమస్యనే తెచ్చిందని చెప్పుకోవచ్చు.

Also Read: పంచాయతీ తర్వాత పరిషత్‌..: రంగులు పునరుద్ధరించొద్దు

ఇంటింటికీ బియ్యం పథకం పూర్తిస్థాయిలో ప్రారంభం కాకముందే.. మూలనపడే పరిస్థితి ఏర్పడింది. వాహనదారులు రెండురోజులకే తమవల్లకాదంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో అధికారులు హైరానా పడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పచ్చజెండా ఊపడంతో విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి సైరన్ మోగించుకుంటూ.. ఊళ్లకు చేరిన ఇంటింటికి రేషన్ బియ్యం పథకం.. వాహనాలు.. ఎక్కడివక్కడే ఉండిపోయాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో బియ్యం పంపిణీ ప్రస్తుతం పట్టణాలు.. నగరాలకే పరిమితం అయ్యింది. కానీ తొలిరోజు నుంచే పథకంలో లోపాలు బయటపడ్డాయి. ప్రభుత్వం వందల కోట్లు వెచ్చించి వాహనాలు కొనుగోలు చేసింది. వాటిని ఎమ్మెల్యేలు సూచించిన వారికి ఇచ్చింది. స్వయం ఉపాధికి తోడు కొదిరోజుల తరువాత వాహనం కూడా వారికి సొంతం అవుతుందని హామీ ఇచ్చింది సర్కారు.

Also Read: ఒకే మాట.. ఒకే కట్టుబాటు..: ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు

ఇంటింటికీ బియ్యం పంపిణీకి రాష్ట్రవ్యాప్తంగా 9,230 వాహనాలు కొనుగోలు చేశారు. ఒక్కో వాహనం నెలకు 1800 కార్డుదారుల ఇంటికి వెళ్లి బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తుంది. రోజుకు వంద చొప్పున పద్దెనిమిది రోజుల లెక్కను ప్రభుత్వం చెప్పింది. క్షేత్రస్థాయిలో పథకాన్ని ప్రారంభించిన తరువాత అసలు సమస్యలు వచ్చి పడుతున్నాయి. రేషన్ దుకాణాల వద్ద ఉదయం 30 బస్తాలను తామే మోసుకుని వాహనాల్లో నింపుకోవాలి. తరువాత వంద ఇళ్లకు పంపిణీ చేయాలి. లబ్ధిదారుల వెలిముద్ర ఈ పాస్ విధానంలో తీసుకోవాలి.

ఉపాధి దొరుకుతుందని 60వేలు కట్టి వాహనాలు తీసుకుంటే.. ఇప్పుడు వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. 1800మదికి రేషన్ సరుకులు పంపిణీ చేయాలంటే.. నెలంతా పడుతుంది. నెలంతా కష్టపడితే… మొదట పదహారు వేలు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు రూ.21వేలకు పెంచి ఇస్తామని చెబుతోంది.ఇందులోనే పెట్రోల్ ఖర్చులు కూడా ఉంటాయి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

అయితే సమస్య ఎక్కడ వచ్చిందో తెలియదు కానీ.. రెండు రోజులకే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రేషన్ బియ్యం పింపిణీని నిలిపివేశారు. తమవల్ల కాదని అధికారులకు చెప్పేస్తున్నారు. ఒక్కొక్కరికి రేషన్ పంపిణీ చేయడానికి పది నిమిషాలు పడుతోందని ఇలా రోజుకు వందమందికి ఇవ్వడం ఎలా సాధ్యం అవుతుందని అడుగుతున్నారు. అయితే పట్టణాలతో పాటు ఎన్నికల కోడ్ ముగియగానే గ్రామాల్లోని వాహనాలు కూడా ప్రారంభిస్తే.. అసలు విషయం తెలిసే అవకాశం ఉంది.