https://oktelugu.com/

ఈ ఆదివారం తెలుగు లోగిళ్ళల్లోకి ఫుల్ ఫన్ !

‘స్టార్ మా’లో ఈ ఆదివారం మరింత ప్రత్యేకంగా ఉండబోతుంది. ముఖ్యంగా ప్రేక్షకులను అలరించేందుకు సెలెబ్రిటీలు అందరూ తెలుగు లోగిళ్ళకు రాబోతున్నారు. అందుకోసం కొన్ని స్పెషల్ కార్యక్రమాలతో పాటు మధ్యాహ్నం 12 గంటల నుంచి “రేస్ అఫ్ ఎంటర్ టైన్మెంట్ ” అనే ప్రోగ్రామ్ ను ప్రారంభించబోతున్నారు. మొత్తానికి ఈ ఆదివారం వినోదం ఓ విందు భోజనంలా ఉండబోతోంది అన్నమాట. Also Read: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన వెంకటేష్ హీరోయిన్ ! కాగా ప్రేక్షకులు ఎంతో అభిమానించే రెగ్యులర్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 6, 2021 / 01:16 PM IST
    Follow us on


    ‘స్టార్ మా’లో ఈ ఆదివారం మరింత ప్రత్యేకంగా ఉండబోతుంది. ముఖ్యంగా ప్రేక్షకులను అలరించేందుకు సెలెబ్రిటీలు అందరూ తెలుగు లోగిళ్ళకు రాబోతున్నారు. అందుకోసం కొన్ని స్పెషల్ కార్యక్రమాలతో పాటు మధ్యాహ్నం 12 గంటల నుంచి “రేస్ అఫ్ ఎంటర్ టైన్మెంట్ ” అనే ప్రోగ్రామ్ ను ప్రారంభించబోతున్నారు. మొత్తానికి ఈ ఆదివారం వినోదం ఓ విందు భోజనంలా ఉండబోతోంది అన్నమాట.

    Also Read: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన వెంకటేష్ హీరోయిన్ !

    కాగా ప్రేక్షకులు ఎంతో అభిమానించే రెగ్యులర్ కార్యక్రమాలతో పాటు “రేస్ అఫ్ ఎంటర్ టైన్మెంట్ ” కొత్త షోతో మంచి కిక్ ఇవ్వబోతుంది ‘స్టార్ మా’. ఇక తన మాటలతో మాయాజాలం చేసే సీనియర్ యాంకర్ సుమ “స్టార్ట్ మ్యూజిక్” తో చేస్తున్న సందడి ఓ రేంజ్ లో ఉండటం ఖాయం. పైగా సుమ కోసం కొంతమంది రైటర్స్ టీమ్ ను పెట్టబోతున్నారు. మరి గంటన్నర పాటు సెలెబ్రిటీలతో మ్యూజికల్ గా చేసే మేజిక్ కడుపుబ్బా నవ్వించాలి అంటే.. మధ్యలో బోలెడు జోక్స్ ఉండాలి. అందుకే రైటర్స్ టీమ్ ఇప్పటికే వర్క్ మొదలు పెట్టారు.

    Also Read: బాలయ్యకు కథ చెప్పిన ‘క్రాక్’ డైరెక్టర్ !

    ఏది ఏమైనా ప్రేక్షకులు నవ్వి నవ్వి అలసిపోయేలా ఈ సారి సుమ టీమ్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. అన్నట్టు ఈ షో నుంచి కొద్దీ క్షణాలు రిలాక్స్ కాగానే 1.30 గంటలకు “కామెడీ స్టార్స్” అనే కార్యక్రమం కంటిన్యూ కానుంది. యాంకర్ వర్షిణి చేసే అల్లరి, కామెడీ టీమ్స్ చేసే హంగామా, సెటైర్లు , పంచ్ లు, ఈలలు, గోలలతో ఈ “కామెడీ స్టార్స్” ఫుల్ కామెడీని అందించడం ఖాయం. అలాగే సాయంకాలం ఆరు గంటలకు మరో వెరీ వెరీ స్పెషల్ ఈవెంట్ “బిగ్ బాస్ ఉత్సవం” ఉంది. మొత్తానికి తెలుగు బుల్లితెర వినోదంలో సరికొత్త అధ్యాయాన్ని స్టార్ మా మొదలుపెట్టబోతుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్