Rajasthan HC Landmark judgment: మనదేశంలో వివాహ వ్యవస్థ అనేది అత్యంత బలమైనది. పెద్దల సమక్షంలోనే ఈడు వచ్చిన అమ్మాయి, అబ్బాయికి పెళ్లి చేస్తారు. ఇలాంటి వ్యవస్థ ద్వారా కుటుంబాల మధ్య బలమైన బంధాలు ఏర్పడుతుంటాయి. కొత్త కొత్త బంధుత్వాలు కలుస్తుంటాయి. మన దేశంలో కుటుంబ వ్యవస్థ అనేది ఇత్యంత బలంగా మారడానికి ప్రధాన కారణం వివాహాలు సాంప్రదాయ బద్దంగా జరగడమే.
మారుతున్న కాలానికి అనుగుణంగా వివాహ వ్యవస్థలో కూడా చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ప్రేమ వివాహాలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. మొదట్లో ప్రేమ వివాహాలకు కుటుంబ సభ్యులు అంతగా ఆమోదం తెలిపేవారు కాదు. పైగా ప్రేమ వివాహాలను అంతగా ఒప్పుకునే వారు కాదు. కాలం మారిన తర్వాత పెద్దలు కూడా ప్రేమ వివాహాలకు గ్రీన్ సిగ్నన్ ఇస్తున్నారు. కులాంతర వివాహాలను కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇది మంచి పరిణామమే. అయినప్పటికీ.. ఇటీవల కాలంలో ప్రేమ పెళ్లిలకంటే కూడా సహజీవనాలు పెరిగిపోతున్నాయి.. హైదరాబాదు లాంటి మెట్రోపాలిటన్ నగరంలో సహజీవనం అనేది ఒక స్టేటస్ సింబల్ లా మారిపోయింది. ఏకంగా కోల్డ్ లివింగ్ హాస్టల్స్ వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా సహజీవనానికి సంబంధించి రాజస్థాన్ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. చట్టబద్ధంగా పెళ్లి వయసు రాకపోయినప్పటికీ.. పరస్పర అంగీకారంతో సహజీవనం చేసే హక్కు ఇద్దరు మేజర్లకు ఉంటుందని హైకోర్టు తన తీర్పులో వెల్లడించింది. సహజీవన సాగిస్తున్న ఓ యువతి (18), ఓ యువకుడు (19) తమకు రక్షణ కల్పించాలని రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు ఈ నేపథ్యంలో వారి కేసును విచారించిన రాజస్థాన్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టప్రకారం పెళ్లి చేసుకోనంత మాత్రాన ప్రాథమిక హక్కులు యువత కోల్పోదని జస్టిస్ అనూప్ తీర్పు వెల్లడించారు. మనదేశంలో చట్ట ప్రకారం పురుషులకు వివాహ వయసు 21 సంవత్సరాలు ఆడపిల్లలకు 18 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది.
సహజీవనం వయసులో మాత్రం ఇటువంటి నిబంధన లేదు. అందువల్లే రాజస్థాన్ హైకోర్టు పై తీర్పు వెల్లడించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఇటీవల కాలంలో సహజీవనం అనేది సర్వసాధారణంగా మారిపోయింది కొంతమంది యువత అయితే జీవితాంతం పిల్లల్ని కనకుండా షరతు విధించుకుంటున్నారు. ఉన్నంతకాలం జీవితాన్ని హాయిగా ఆస్వాదించాలని నిబంధన పెట్టుకున్నారు. మరి కొంతమంది యువత మాత్రం పెళ్లికి దూరంగా ఉంటూ నచ్చిన వాళ్ళతో కలిసి ఉంటున్నారు. బేదాభిప్రాయాలు ఏర్పడిన రోజు ఎవరికి వారు బ్రేకప్ చెప్పుకుంటున్నారు. ఇలాంటి సంస్కృతులు విదేశాలలో మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు మనదేశంలోకి కూడా రావడం ఆందోళన కలిగిస్తోంది. కోర్టులు సహజీవనాన్ని సమర్ధించే విధంగా తీర్పులు చెప్పడం కలకలం రేపుతోంది.