https://oktelugu.com/

తెలంగాణలో త్వరలో రైతు రుణమాఫీ

తెలంగాణ రైతు రుణమాఫీకి సర్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రూ.లక్షలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై కసరత్తు చేసిన అధికారులు.. మొత్తం 36.80 లక్షల మంది రైతులు ఈ మాఫీ పొందేందుకు అర్హులని తేల్చారు. అందులో గతేడాది 2.96 లక్షల మంది రైతులకు చెందిన రూ.25 వేల వరకు రుణాలపై రూ.408 కోట్లను ప్రభుత్వం మాఫీ చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ.5,225 కోట్లు కేటాయించింది. […]

Written By: , Updated On : March 31, 2021 / 01:59 PM IST
Follow us on

Farmer loan waiver
తెలంగాణ రైతు రుణమాఫీకి సర్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రూ.లక్షలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై కసరత్తు చేసిన అధికారులు.. మొత్తం 36.80 లక్షల మంది రైతులు ఈ మాఫీ పొందేందుకు అర్హులని తేల్చారు. అందులో గతేడాది 2.96 లక్షల మంది రైతులకు చెందిన రూ.25 వేల వరకు రుణాలపై రూ.408 కోట్లను ప్రభుత్వం మాఫీ చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ.5,225 కోట్లు కేటాయించింది.

ఈసారి ఏ రకంగా రుణమాఫీ సొమ్ము విడుదల చేయాలన్న దానిపై వ్యవసాయ శాఖ కసరత్తు చేసింది. అందుకోసం రెండు రకాల ఆప్షన్లను ప్రభుత్వం ముందుంచింది. గతంలో రూ.25 వేల వరకు రుణాలు మాఫీ చేసినందున ఈసారి రూ.25 వేల నుంచి రూ.50 వేల మధ్య ఉన్న రైతుల పంట రుణాలను మాఫీ చేయాలన్నది ఒక ఆప్షన్‌. ఈ కేటగిరీలో 8.02 లక్షల మంది రైతులు అర్హులుగా తేలారు. వారి కోసం రూ.4,900 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. ఇక రెండోది ప్రతి ఒక్కరికీ రూ.25 వేలు మాఫీ చేయాలన్న ఆప్షన్‌ను తయారు చేశారు. అంటే రూ.25 వేల నుంచి రూ.లక్షలోపు రుణాలున్న వారందరికీ రూ.25 వేలు మాఫీ అవుతాయన్నమాట.

అంటే.. ఈ ఆప్షన్‌ ప్రకారం చూస్తే 13.45 లక్షల మంది రైతులు అర్హులుగా తేలారు. అందుకోసం రూ.5,100 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే..ఈ రెండు ఆప్షన్లలో ప్రభుత్వం మాత్రం రెండో ఆప్షన్‌ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి రుణమాఫీకి రెండు ఆప్షన్ల ప్రకారం రైతుల జాబితాను సిద్ధంగా ఉంచినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఒప్పుకున్నట్లుగా ప్రతి ఒక్క రైతుకూ లబ్ధి చేకూరేలా రుణమాఫీ అమలు చేయాలి కాబట్టి అందుకే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. వీలైనంత త్వరలో సొమ్ము విడుదలయ్యే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.

ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇటీవల సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. పంట రుణాల మాఫీ కోసం బడ్జెట్‌లో రూ.6000 వేల కోట్లు కేటాయించారు. గత ఆరు నెలల్లో రుణ మాఫీపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రైతులపై బ్యాంకులు తీవ్ర ఒత్తిడి చేశాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చేసిన కేటాయింపులతో రైతులకు కొంత ఊరట లభించనుంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్