సినీ పరిశ్రమలో కొంతమంది హీరోయిన్లకే స్టార్ హీరో స్థాయిలో సమానంగా క్రేజ్ వస్తోంది. తెలుగులో అలాంటి హీరోయిన్స్ లో విజయశాంతి ఒకరు. తన పేరే బ్రాండ్ గా ఆమె తన సినీ కెరీర్ ను సాగించింది. అప్పట్లో విజయశాంతిని లేడీ అమితాబ్ అని, లేడీ సూపర్ స్టార్ అని పిలిచేవారు అంటేనే, ఆమె ఇమేజ్ ని అర్ధం చేసుకోవచ్చు. అలాంటి విజయశాంతి గురించి ఎవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు..
విజయశాంతికి 14వ ఏటనే సినిమాలో మొదటి అవకాశం వచ్చింది. ఆమెకు అవకాశం రావడానికి ముఖ్యకారణం అప్పటి టాప్ తెలుగు హీరోయిన్ విజయలలిత. విజయలలితకు విజయశాంతి స్వయానా మేనకోడలు. అందుకే విజయలలిత మొదటి నుండి విజయశాంతికి తన ప్రోత్సహాన్ని అందించింది. తమిళ్ లో ప్రముఖ దర్శకుడు భారతి రాజా తెరకెక్కించిన కళుక్కుళ్ ఈరం అనే తమిళ సినిమా ద్వారా వెండితెర పై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది విజయశాంతి. అయితే విజయశాంతి కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా మాత్రం నేటి భారతం.
1983వ సంవత్సరంలో ఫిమేల్ ఓరియెంటెడ్ గా వచ్చిన ఈ సినిమాలో విజయశాంతి నటన అప్పట్లో ఒక్క సంచలనం. దాంతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి విజయశాంతి ఏకైక ఆప్షన్ గా నిలిచారు. ఆ క్రమంలోనే 1990వ సంవత్సరంలో ఆమె మెయిన్ లీడ్ గా వచ్చిన ‘కర్తవ్యం’ సినిమా అప్పట్లో భారీ ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాతో విజయశాంతి స్టార్ డమ్ మెగాస్టార్, సూపర్ స్టార్ రేంజ్ కి వెళ్ళింది.
దాంతో విజయశాంతికి ఒక్కో సినిమాకి కోటి రూపాయిలు పారితోషికం ఇచ్చేవారు, ఒక హీరోయిన్ కోటి రూపాయిలు తీసుకున్న హీరోయిన్ కూడా విజయశాంతినే. పైగా చిరంజీవి, రజినీకాంత్ కంటే తనకే ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేసి రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ కూడా విజయశాంతినే. ఇక విజయశాంతికి కర్తవ్యం సినిమాకి ఉత్తమ నటిగా నేషనల్ కూడా అవార్డు వచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్