Fake Votes In AP: దొంగ ఓట్ల పై నాటి రగడే.. వైసీపీ స్ట్రాటజీ అదే

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లో దొంగ ఓట్ల వ్యవహారానికి సంబంధించి టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఎలక్షన్ కమిషన్ ఇద్దరు జడ్పీ సీఈఓ లను సస్పెండ్ చేసింది.

Written By: Dharma, Updated On : August 29, 2023 5:14 pm

Fake Votes In AP

Follow us on

Fake Votes In AP: ఏపీ రాజకీయాల్లో సరిగ్గా ఐదేళ్ల కిందట నాటి సీన్ రిపీట్ అయ్యింది. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయి అంటూ ప్రధాన ప్రతిపక్షం టిడిపి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మరోవైపు టిడిపి నే అక్రమాలకు పాల్పడిందని వైసిపి ఎంపీలు నేరుగా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల సాయంతో టిడిపి అనుకూల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ గత కొద్ది నెలలుగా తెలుగుదేశం పార్టీ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగుదేశం ఫిర్యాదుతో రెండు జిల్లాల జడ్పీ సీఈఓ లను ఈసీ సస్పెండ్ చేసింది.

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లో దొంగ ఓట్ల వ్యవహారానికి సంబంధించి టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఎలక్షన్ కమిషన్ ఇద్దరు జడ్పీ సీఈఓ లను సస్పెండ్ చేసింది. అటు తరువాత దీనిపై కదలిక వచ్చింది. తెలుగుదేశం పార్టీ పోరాటం ప్రారంభించింది. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే అదే రోజు పట్టు పట్టి మరి వైసీపీ ఎంపీలు ఈసీ అపాయింట్మెంట్ తీసుకుని ఫిర్యాదు చేయడం విశేషం. అయితే ఈ ఫిర్యాదు కాపీలను చంద్రబాబు మీడియాకు అందించారు. వైసిపి ఎంపీలు మాత్రం అటువంటి ఏవీ మీడియాకు ఇవ్వలేదు.

అయితే వైసిపి ఒక కొత్త వాదనకు తెరతీసింది. 2014 నుంచి ఓటర్ జాబితాలో అక్రమాలపై పరిశోధన చేయాలని కోరుతోంది. అలా అయితే 2019 ఎన్నికల్లో టిడిపి ఎందుకు ఓటమి చవి చూసింది అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేకపోతోంది. వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఫామ్ 7 ద్వారా లక్షలాది ఓట్లను తొలగించేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలు ఎదుర్కొంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఊరుకుంటుందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

2018లో వైసీపీ సైతం ఇదే పద్ధతిలో ఆందోళన వ్యక్తం చేసింది. ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘానికి పదేపదే ఫిర్యాదులు వెళ్లాయి. ఓటర్ల జాబితాలో నాడు అధికారంలో ఉన్న టిడిపి అక్రమాలకు పాల్పడిందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించింది. సేవా మిత్ర, బ్లూ ఫ్రాగ్ వంటి యాప్ లతో వైసిపి అనుకూల ఓట్లను అప్పట్లో టిడిపి నేతలు తొలగించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. మొత్తానికైతే ఎన్నికల ముంగిట దొంగ నోట్ల వ్యవహారం అధికార, విపక్షాలకు పెద్ద పని తెచ్చినట్టయింది.