ఫేక్ అలెర్ట్: కరోనా మరణాలపై ఇవే నిజాలు

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఏ స్థాయిలో పెరుగుతున్నాయో.. అదే సమయంలో భారీ ఎత్తున ఫేక్ న్యూస్ కూడా విస్త్రతంగా ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో, భారత దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఎన్ని కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి? అందులో ఎంతమంది చనిపోయారనే విషయాలపై కొన్ని ఫేక్ న్యూస్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ క్రింది అధికారిక వెబ్ సైట్ల ద్వారా.. కరెక్ట్ సమాచారాన్ని పొందుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మీద అధికారిక సమాచారం కోసం […]

Written By: Neelambaram, Updated On : April 2, 2020 8:45 pm
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఏ స్థాయిలో పెరుగుతున్నాయో.. అదే సమయంలో భారీ ఎత్తున ఫేక్ న్యూస్ కూడా విస్త్రతంగా ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో, భారత దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఎన్ని కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి? అందులో ఎంతమంది చనిపోయారనే విషయాలపై కొన్ని ఫేక్ న్యూస్ వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ క్రింది అధికారిక వెబ్ సైట్ల ద్వారా.. కరెక్ట్ సమాచారాన్ని పొందుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మీద అధికారిక సమాచారం కోసం http://hmfw.ap.gov.in/covid_dashboard.aspx చెక్ చేయండి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సమాచారం అందజేస్తుంది.

ఇక తెలంగాణ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఓ కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం రకరకాల ఫేక్ న్యూస్ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఓసారి అలాంటి వార్తలను ఇతరులకు ఫార్వార్డ్ చేసే ముందు ఇక్కడ చెక్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. https://factcheck.telangana.gov.in/

ఇవి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం. అయితే, ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన కరోనా సమాచారం https://www.mohfw.gov.in/ లో తెలుసుకోవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఎన్ని కరోనా కేసులు ఉన్నాయనే వివరాలను https://www.worldometers.info/coronavirus/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO దీన్ని నిర్వహిస్తోంది.