https://oktelugu.com/

అటు తిరిగి ఇటు తిరిగి.. అఖిల్ దగ్గరకే వచ్చాడు !

సైరా లాంటి భారీ సినిమా చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి, తన తరువాత సినిమాని పట్టుకోవడానికి మాత్రం నానా ఇబ్బందలు పడుతున్నాడు. సైరా సినిమా ఫలితం ఏమిటన్నది పక్కన పెడితే.. ఒక డైరెక్టర్ గా సురేందర్ రెడ్డి మంచి పనితనం చూపించాడు. కానీ, ఆ సినిమా భారీ సక్సెస్ కాకపోవడం, ఇప్పుడు సురేందర్ రెడ్డికి పెద్ద సమస్య అయిపొయింది. ప్రభాస్ స్థాయి హీరో నుండి దిగువ స్థాయి హీరోలకు ట్రై చేసుకునే లెవల్ లో దర్శకుడు సురేందర్ […]

Written By:
  • admin
  • , Updated On : August 13, 2020 / 12:23 PM IST
    Follow us on


    సైరా లాంటి భారీ సినిమా చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి, తన తరువాత సినిమాని పట్టుకోవడానికి మాత్రం నానా ఇబ్బందలు పడుతున్నాడు. సైరా సినిమా ఫలితం ఏమిటన్నది పక్కన పెడితే.. ఒక డైరెక్టర్ గా సురేందర్ రెడ్డి మంచి పనితనం చూపించాడు. కానీ, ఆ సినిమా భారీ సక్సెస్ కాకపోవడం, ఇప్పుడు సురేందర్ రెడ్డికి పెద్ద సమస్య అయిపొయింది. ప్రభాస్ స్థాయి హీరో నుండి దిగువ స్థాయి హీరోలకు ట్రై చేసుకునే లెవల్ లో దర్శకుడు సురేందర్ రెడ్డి పడిపోయాడు.

    Also Read: కావాలని ఎక్స్ పోజింగ్ చేస్తోందట !

    ఆ మధ్య తన తరవాత సినిమాని సురేందర్ రెడ్డి, రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్లాన్ చేస్తారని టాక్ వినిపించింది. ఆ మేరకు కొన్ని సిట్టింగ్ లు కూడా జరిగాయట. కానీ అది ఏమయిందో తెలియదు గానీ, మళ్ళీ సురేందర్ రెడ్డి చైతు పేరు లైన్ లోకి వచ్చింది. క్రిష్ కథ, నిర్మాణంలో సురేందర్ రెడ్డి డైరక్షన్లో సినిమా అని నాగార్జున ఇచ్చిన ఐడియా అట. అయితే ఈ మధ్య మళ్లీ అది పక్కకు వెళ్లింది.

    Also Read: బాలయ్యకి లావణ్య సెట్ అయింది !

    ఇప్పుడు రవితేజ హీరోగా వక్కంతం వంశీ కథతో సురేందర్ రెడ్డి మరో సినిమా అన్న వార్తలు బయటకు వస్తున్నాయి. ఏమైందో ఏమో గానీ, సురేందర్ రెడ్డి మళ్లీ ఇప్పుడు అఖిల్ దగ్గరకే వెళ్తున్నారని తెలుస్తోంది. అఖిల్ ప్రస్తుతం చేస్తున్న బొమ్మరిల్లు భాస్కర్ సినిమా తరువాత చేయబోయే సినిమా సురేందర్ రెడ్డితోనే అట. ఇప్పటికే సురేందర్రెడ్డి అఖిల్ కోసం స్క్రిప్ట్ పనులు చేస్తున్నాడట.