ఒకవేళ మీ బయోపిక్ ను సౌత్ లో తీస్తే, మీ పాత్రలో ఏ హీరో నటించాలని మీరు భావిస్తున్నారు ? అని యాంకర్ ప్రశ్నించింది. అయితే ఆ ప్రశ్న పూర్తి కాకముందే వెంటనే రైనా మాట్లాడుతూ.. ‘నా పాత్రలో హీరో సూర్య నటిస్తే బాగుంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి రైనా సెలెక్షన్ బాగుంది. సూర్య అయితే పాత్రకు తగ్గట్టు మారుతూ తనదైన శైలిలో నటిస్తాడు కాబట్టి, తన పాత్రకు విలువ పెరుగుతుంది అని రైనా భావించి ఉండొచ్చు.
అయితే రైనా, సూర్య నటన గురించి కూడా గొప్పగా కామెంట్స్ చేసి ఉంటే బాగుండేది అని ఫీల్ అవుతూ పోస్ట్ లు పెట్టారు. దాంతో రైనా సూర్య నటన బాగుంటుందని, ఆయన పాత్రలకు అనుగుణంగా తన శైలిని మార్చుకుని తనదైన నటనను కనబరుస్తాడని అందుకే సూర్య అంటే తనకు ఇష్టమని అంటూ మళ్ళీ సూర్య పై తన అభిమానాన్ని చూపించాల్సి వచ్చింది.
ఇక క్రికెటర్ల బయోపిక్ విషయానికి ఎప్పటి నుండో ఉన్న డిమాండ్ యువరాజ్ సింగ్ బయోపిక్. యువరాజ్ లైఫ్ లో ఉన్న డ్రామా సినిమాకి మంచి ఫుటేజ్ అవుతుందని, అందుకే యువరాజ్ బయోపిక్ ను మేకర్స్ సినిమాగా తీసుకురావాలని, పైగా నిజమైన హీరో యువరాజ్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.