Teenmar Mallanna: క్యూ న్యూస్ అధినేత, తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ విడుదలపై మార్గం సుగమం అయిందని తెలుస్తోంది. జ్యోతిష్యడి ఆత్మహత్యాయత్నం కేసులో మల్లన్నను రిమాండ్ కు తరలించారు. ఆయనకు బెయిల్ మంజూరు అయినా మరో కేసులో ఆయనను జైల్లో పెట్టారు. దీంతో ఆయన అరెస్టుపై ఎవరు స్పందించడం లేదు. కానీ బీజేపీ మాత్రం ఆయనను బయటకు తీసుకువచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. తీన్మార్ మల్లన్న సొంతంగా రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో బీజేపీ ముందుకు రావడంతో మల్లన్న భార్య కూడా వారికి సహకరించేందుకు సిద్ధంగా ఉంది. అక్రమ అరెస్టుల నుంచి కాపాడటానికి నేరుగా కేంద్ర హోం మంత్రి, బీజేపీ అధ్యక్షుడు నడ్డాకు మల్లన్న భార్య లేఖలు రాసింది. దీంతో తాను ఎదుర్కొన్న కష్టాలను ఏకరువు పెట్టారు. బీజేపీలో చేరేందుకు సిద్ధమేనని చెప్పడంతో మల్లన్న విడుదలపై బీజేపీ పనులు ప్రారంభించింది. దీంతో వ్యూహాత్మకంగానే మల్లన్నను జైల్లో పెట్టినట్లు తెలిసినా ఏం చేయలేకపోయారు.
నిజానికి మల్లన్న లాంటి వ్యక్తిని జైల్లో నిర్బంధించడం కుట్రలో ఒక భాగమే. క్యూ న్యూస్ చానల్ పేరుతో మల్లన్న ప్రభుత్వంపై విరుచుకుపడటంతో ఆయనపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బయటకు రావడానికి ప్రయత్నాలు చేసినా అవి ప్రయోజనం కలిగించలేదు. దీంతో మల్లన్న బీజేపీ సాయం కోరినట్లు చెబుతున్నారు.
ఒంటరి పోరాటం ఫలితం ఇవ్వకపోవడంతో బీజేపీ సాయంతో బయటకు రావాలని ఆశిస్తున్నారు. దీన్ని బీజేపీ కూడా నిజమేనని చెబుతోంది. మల్లన్నను బయటకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జైల్లో ఉన్న మల్లన్న జైలు నుంచి విముక్తి అయ్యేందుకు బీజేపీ సాయం తీసుకుంటున్న క్రమంలో ఆయనపై కేసులు ఉండకుండా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.