జనసేన పార్టీ అధినే పవన్ కల్యాణ్ జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో శ్రమదానం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. పాడైన రోడ్లకు మరమ్మతులు చేసే కార్యక్రమంలో పాల్గొని ఆయన శ్రమదానం చేయాలని భావించారు. కొత్త చెరువు పంచాయీతీ పరిధిలోని పుట్టపర్తి- ధర్మవరం రోడ్డుకు శ్రమదానం ద్వారా మరమ్మతులు చేపట్టాలని కూడా పవన్ నిర్ణయించారు. అటు అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజవవర్గంలో ఓ రోడ్డుకు మరమ్మతు చేపట్టే కార్యక్రమాన్ని జనసేన చేపట్టాలని నిర్ణయిచుకుంది.

రాష్ట్రంలో ఛిత్రమైన రహదారులను మరమ్మతు చేపట్టాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ ఈ నెల 2,3,4 తేదీల్లో సామాజిక మాధ్యమాలు వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం తెలిసిందే. నాలుగు వారాలు గడువునా ప్రభుత్వం ఇంకా ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడం పై ఆ పార్టీ పండిపడింది. నగరంలో రోడ్లపై గుంతలు పూడ్చడం ద్వారా శ్రమదానం కార్యక్రమం నిర్వహించి అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
పవన్ కల్యాన్ రేపు ఉదయం రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. నగరంలో రోడ్లపై గుంతలు పూడ్చడం ద్వారా శ్రమదానం కార్యక్రమం నిరహిస్తారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతారు. అయితే కాటన్ బ్యారేజీ మీద పవన్ కల్యాణ్ చేసే శ్రమదాన కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు అధికారులు. సరైన సాంకేతిక పరిజ్ఞనం లేకుండా గుంలను పూడ్చితే బ్యారేజీకి నష్టం కలుగగుతుంది కాబట్టి అనుమతి కుదరదని స్పష్టం చేశారు. అయితే బ్యారేజీపై శ్రమదానం చేసి తీరుతామని బెబుతున్నారు.