Republic: సినిమాకి రెండు ముగింపులు ఉంటాయి, సుఖాంతం, దుఃఖాంతం. అయితే, నేటి జనరేషన్ కి బాధతో ముగింపు నచ్చదు. అందుకే ఈ మధ్య ఏ తెలుగు సినిమా ట్రాజెడీ ఎండింగ్ తో రావడం లేదు. అయితే గతంలో దుఃఖాంతాలతో వచ్చిన కొన్ని సినిమాలు ఘన విజయాలు సాధించిన సంఘటనలు ఉన్నాయి. కానీ జనరేషన్ మారింది. ట్రాజెడీ సినిమాలకు కాలం చెల్లింది.

ఇలాంటి నేపథ్యంలో విడుదలైన సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా ట్రాజెడీ సినిమా. పైగా హీరో చనిపోతాడు. ఫామ్ లో ఉన్న ఒక హీరో సినిమా ట్రాజెడీ ఎండింగ్ తో రావడం.. ఈ మధ్య జరగలేదు. ఇప్పుడు రిపబ్లిక్ వచ్చింది. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తోందో చూడాలి. ఇప్పటికైతే సినిమాకి ఏవరేజ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా పెద్దగా లేవు.
సినిమా చూసిన వారంతా పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా హీరో చనిపోవడం నచ్చలేదు అంటున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో బాగా నిరుత్సాహ పడ్డారు. అందుకే అంటారు, మాస్ హీరోలు ట్రాజెడీస్ చేయకూడదని. గతంలో ఎన్టీఆర్ విషాదాంతాల్లో రక్తసంబంధం, మంచి-చెడు వంటి విజయాలు ఉన్నా.. అలాగే ఏయన్నార్ నటించిన ట్రాజెడీస్ లో దేవదాసు, ప్రేమాభిషేకం లాంటి చిత్రాలు కూడా మంచి హిట్ అయ్యాయి.
కానీ ఆ తర్వాత కాలంలో వచ్చిన సినిమాలు మాత్రం పెద్దగా విజయాలు సాధించలేదు. చివరకు ఎన్టీఆర్, ఏఎన్నార్ లు కూడా పరాజయాన్ని చవిచూశారు. సమస్యంతా ఫామ్ లో ఉన్న హీరో పాత్ర తుదకు కన్నుమూస్తే ఆ విషాదాంతం ప్రేక్షకులు భరించలేరు. మరి తాజాగా వచ్చిన సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా కూడా ప్లాప్ దిశగానే పయనిస్తోంది. మొత్తమ్మీద మాస్ హీరోకి దుఃఖాంతం కలిసి రాదు అని తేలిపోయింది.