Bala Krishna House: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. ఇన్నాళ్లుగా సాగుతున్న విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. కొద్ది రోజులుగా ఇరు పార్టీలు మాటల యుద్ధం పెరుగుతున్న సందర్భంలో తాజాగా రెండు పార్టీల కార్యకర్తల మధ్య రగడ రేగుతోంది. వైసీపీ కార్యకర్తలు బాలకృష్ణ ఇంటిని ముట్టడించే క్రమంలో ఇరు వర్గాలు రెచ్చిపోయాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.

హిందూపురంకు వైసీపీ చేసిందేమీ లేదని టీడీపీ నేతలు విమర్శలు చేయడంతో రెండు పార్టీల్లో ఆగ్రహావేశాలు పెరిగాయి. దీంతో సవాలుకు సిద్ధమేనా ఇరు పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదే తరుణంలో వైసీపీ నేతలు బాలకృష్ణ ఇంటిని చుట్టుముట్టాలని బయలుదేరారు. దీంతో టీడీపీ నేతలు కూడా తేల్చుకుందామని రావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.
Also Read: ‘బాలయ్య’ కోసం వెయిట్ చేస్తాడట.. రేంజ్ మారిపోయింది !
దీంతో పోలీసులు ఇరు పార్టీల నేతలను శాంతింపజేశారు. హిందూపురంలోని డంపింగ్ యార్డును తరలించడం తప్ప వైసీపీ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వైసీపీతో చర్చలకు తాము సిద్ధమేనని టీడీపీ నేతలు ప్రకటించడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అక్కడ అంతా టెన్షన్ నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి గొడవలు చోటుచేసుకోకుండా బందోబస్తు నిర్వహించారు.
కొద్ది రోజులుగా వైసీపీ టీడీపీ నేతల మధ్య విభేదాలు పొడచూపుతున్నాయి. అధికారం కోసం రెండు పార్టీలు తమ శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నాయి. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో ఇరు పార్టీలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో భవిష్యత్ లో ఎన్నికల నాటికి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: మెగాస్టార్‌కు డూప్ గా నటించేది ఎవరో తెలుసా? 30 ఏండ్లుగా ఒక్కడే…