Rashmika Mandanna: అదృష్టం అంటే.. క్రేజీ బ్యూటీ ‘రష్మిక మండన్నా’దే. కరెక్ట్ గా నాలుగేళ్ల క్రితం అవకాశాల కోసం హైదరాబాద్ టు బెంగళూరు తిరిగేది. ఎప్పుడైతే ‘ఛలో’ సినిమా చేసిందో ఇక అప్పటి నుంచి రష్మిక క్రేజ్.. స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత లక్కీగా మహేష్ సినిమా వచ్చి.. అది సూపర్ హిట్ అవ్వడంతో ఇక రష్మిక దశ తిరిగింది. బన్నీ పిలిచి అవకాశం ఇచ్చాడు. పుష్పతో మరింతగా క్రేజ్ సంపాదించింది.

దాని ఫలితంగా వరుస సినిమాలు వస్తున్నాయి. ‘చి.ల.సౌ’ సినిమాతో దర్శకుడిగా హిట్ అందుకున్న రాహుల్ రవీంద్రన్ చేయబోతున్న కొత్త సినిమాలో రష్మిక ప్రధాన పాత్రలో నటించబోతుంది. హీరోయిన్ ప్రాధాన్యమున్న కథతో సాగే ఈ సినిమాలో రష్మికనే మెయిన్. నిజానికి ఈ సినిమా గురించి చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నా.. ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు.
అయితే, రాహుల్ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. ఇక ఈ సినిమాలో రష్మిక అమాయకురాలైన యువతిగా కనిపించబోతుంది. సినిమా మొత్తం ఆమె పాత్ర అమాయకురాలి గానే ఉంటుందట. పైగా ఆమె అమాయకత్వమే సినిమాలో మెయిన్ హైలైట్ అనితెలుస్తోంది . మరి అమాయకురాలిగా రష్మిక ఎలా నటిస్తోందో చూడాలి.
Also Read: రష్మికను ఆడేసుకుంటున్న నెటిజన్లు.. ఎక్కడ పడితే అక్కడ ఆ పనేనా అంటూ కామెంట్లు
సినిమా కథ విషయానికి వస్తే.. అమాయకురాలైన ఓ అమ్మాయి తన జీవితంలో ఎన్ని కష్టాలు పడింది ? ఆ కష్టాలను ఎదుర్కొని తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంది ? అనేది మెయిన్ కాన్సెప్ట్. కచ్చితంగా ఈ అమాయకురాలైన పాత్రలో రష్మిక అద్భుతంగా నటిస్తోంది. ఎందుకంటే.. రష్మిక పేస్ లో అమాయకత్వం బాగా పలుకుతుంది.
మొత్తమ్మీద రష్మిక ఇప్పటివరకు కొన్ని పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌లో నటించింది గాని, ఇలా సోలోగా మెయిన్ సినిమా చేయలేదు. మరి మొదటసారి ఆమె పై ఒక సినిమాని తీసుకురాబోతున్నారు. ఈ సినిమా వర్కౌట్ అయితే ఆమె నుంచి మరిన్నీ సినిమాలు రావడం పక్కా. అన్నట్టు రష్మిక బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ సినిమా చేస్తోంది కాబట్టి.. ఆమెకు పాన్ ఇండియా మార్కెట్ కొంతైనా వస్తోంది.
Also Read: సాయిపల్లవిపై శ్యామ్‌సింగరాయ్ నిర్మాత ప్రశంసల వర్షం