Afghanistan Blast:పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్ ఎయిర్ పోర్టు.. 13మంది మృతి

అమెరికా అనుకున్నట్టే అయ్యింది. అమెరికా, నాటో దళాల పర్యవేక్షణలో ఉన్న కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద భారీ పేలుళ్లు జరిగే అవకాశం ఉందని నిన్ననే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించాడు. 24 గంటలు కూడా గడవకముందే అప్ఘనిస్తాన్ లోని కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద భారీ పేలుళ్లు సంభవించాయి. అప్ఘాన్ నుంచి తమ దేశ పౌరులను ఆయా దేశాలు తరలిస్తున్న కీలక సమయంలో ఆగస్టు 31లోపే తాము ఖాళీ చేస్తామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నిన్న ప్రకటించాడు. […]

Written By: NARESH, Updated On : August 26, 2021 9:24 pm
Follow us on

అమెరికా అనుకున్నట్టే అయ్యింది. అమెరికా, నాటో దళాల పర్యవేక్షణలో ఉన్న కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద భారీ పేలుళ్లు జరిగే అవకాశం ఉందని నిన్ననే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించాడు. 24 గంటలు కూడా గడవకముందే అప్ఘనిస్తాన్ లోని కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద భారీ పేలుళ్లు సంభవించాయి.

అప్ఘాన్ నుంచి తమ దేశ పౌరులను ఆయా దేశాలు తరలిస్తున్న కీలక సమయంలో ఆగస్టు 31లోపే తాము ఖాళీ చేస్తామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నిన్న ప్రకటించాడు. అయితే కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద పేలుళ్లు జరిగే అవకాశం ఉందని.. ఈ మేరకు నిఘా వర్గాల హెచ్చరించాయని తెలిపారు. ప్రజలు ఎవరూ కాబూల్ ఎయిర్ పోర్టుకు రావద్దని సూచించారు.

ఈ క్రమంలోనే కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. బాంబులతో వచ్చిన ముష్కరులు ఎయిర్ పోర్టు వద్ద తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో 13మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు. ఈ ఘటనలో అమెరికా భద్రతా బలగాలకు చెందిన ముగ్గురు సైతం గాయపడినట్లు సమాచారం.

బాంబులతో వచ్చిన ముష్కరులే తమను తాము పేల్చేసుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానిక హోటల్ వద్ద మరో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ బాంబు పేలుడులో తీవ్రంగా గాయపడ్డ ప్రజలు రక్తమోడుతున్నా ప్రాణాలు రక్షించుకోవడానికి ఆస్పత్రికి పరిగెడుతున్న దృశ్యాలు కలిచివేశాయి.