కరోనా వైరస్ ప్రజలను ఎంత ఇబ్బందులకు గురి చేసిందో అందరికి తెలిసిందే. రెండో దశలో వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. దీంతో మూడో దశపై ముందుగానే అప్రమత్తమైంది. కరోనా చిన్నారుల్ని పట్టి పీడిస్తుందనే అంచనాల మధ్య పిల్లలకు కరోనా వైద్యంపై మార్గదర్శకాలను విడుదల చేసింది.
కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం కరోనా సోకిన పిల్లలకు రెమిడెసివర్ ఇంజక్షన్ ఇవ్వకూడదు కరోనా నిర్ధారణకు సంబంధిిచి చేసే సిటీ స్కాన్ విషయంలో కూడా పరిమితులు విధించింది. ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతే చిన్నారులకు సిటీ స్కాన్ సిఫారసు చేయాలని వైద్యులకు సూచించింది.
కరోనా చికిత్సలో అత్యంత కీలకమైన యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ వాడకానికి సంబంధించి కూడా గైడ్ లైన్స్ విడుదల చేసింది. చిన్నారుల్లో ఇన్ఫెక్షన్ఎక్కువగా ఉందని నిర్ధారించకున్న తరువాత యాంటీబయాటిక్స్ ఇవ్వాలని, ఇక వైరస్ తీవ్రత అసలు లేకపోయినా మధ్యస్తంగా ఉన్నా స్టెాయిడ్స్ ఇవ్వొద్దని సూచించింది. ఒకవేళ వైరస్ ముదిరితే మాత్రం ప్రత్యక్ష పర్యవేక్షణలో వైద్యులు పిల్లలకు స్టెరాయిడ్స్ ఇవ్వాలని సూచించింది.
దేశంలో చిన్న పిల్లల వైద్యులు సరిపడినంత మంది లేరు కరోనా సోకిన పిల్లలందరిని హోం ఐసోలేషన్ లో పెట్టడం తల్లిదండ్రులకు చాలా కష్టం. ఈ నేపథ్యంలో చిన్న పిల్లల హాస్పిటల్స్, వైద్యులపై పెనుభారం పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మూడో దశలో కరోనా వైరస్ పిల్లలపై దాడి చేస్తుందన్న ఆధారాలు లేవని ఎయిమ్స్ వైద్యులు చెబుతున్నప్పటికి భయం మాత్రం తొలగిపోలేదు.