వనిత విజయ్ కుమార్.. మూడు పెళ్లిళ్లు, వివాదాస్పద వ్యాఖ్యలు, నెటిజన్లతో గొడవలు, మీడియాకి బోల్డ్ న్యూస్.. ఇది ఆమె ప్రొఫైల్. వ్యక్తిగత జీవితంలో ఎన్నో బాధలు వైఫల్యాలతో వనిత, ప్రొఫెషనల్ గాను కెరీర్ లో ఎదగలేకపోయింది. దీనికి తోడు ఇప్పటికే చేసుకున్న మూడు పెళ్లిళ్లు ఆమెకు కన్నీళ్లే మిగిల్చాయి. ముఖ్యంగా గతేడాది కరోనా సంక్షోభంలో ఆమె చేసుకున్న మూడో పెళ్లి ఎంతో వివాదం ఆయింది.
ఆ తరువాత ఆ పెళ్లి కూడా మూన్నాళ్ల ముచ్చట అవ్వడం కూడా ఆమెకు తీరనిలోటే. అయితే, ఆ లోటును పూడ్చుకోవడానికి ఇప్పుడు ఆమె నాలుగో పెళ్లికి సిద్ధం అవుతుందనే ప్రచారం గత రెండు రోజుల నుండి వైరల్ అవుతుంది. ఐతే, తాజాగా తన నాలుగో పెళ్లి పై వనిత క్లారిటీ ఇచ్చింది. ఇక తనకు అలాంటి ఆలోచన లేదని, ఇలాంటి ప్రచారం చేయకండి అంటూ వేడుకొంటోంది వనిత.
ఆమె మాటల్లోనే ‘ఇక పై నాకు నా పిల్లలే నా జీవితం. గతంలో చేసిన తప్పులు ఇక చెయ్యను. దయచేసి నా వ్యక్తిగత జీవితం గురించి తప్పుడు వార్తలు సృష్టించి నన్ను బాధ పెట్టకండి’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. నిజానికి ఆ మధ్య తాను ఎవరినో ప్రేమిస్తున్నానని, కానీ ఈ సారి తొందర పడి పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు అంటూ వనిత చెప్పుకొచ్చింది. అప్పటి నుండి ఆమె మరో పెళ్లికి రెడీ అవుతోంది అంటూ పుకార్లు పుట్టిస్తున్నారు మేకర్స్.
ఇక వనిత తన కన్న తండ్రి విజయ్ కుమార్ పైనే కేసుపెట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుండి విజయ్ కుమార్ ఫ్యామిలీ మొత్తం వనితను దూరం పెట్టారు. ఏది ఏమైనా వనిత కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్ అయిపోయింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకప్పుడు తనకు లైన్ వేశాడని చెప్పి.. బన్నీకి కూడా షాక్ ఇచ్చింది ఈ చెన్నై బ్యూటీ. అల్లు అర్జున్ డాన్స్ లు అంటే మహా ఇష్టం అట వనితకు. అలాగే ఎన్టీఆర్ తన ఫేవరేట్ హీరో అట. ప్రస్తుతం వనిత సినిమా ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది.