విస్తరిస్తున్న డెల్టా ప్లస్: పలు రాష్ట్రాల్లో మళ్లీ ఆంక్షలు

ఈ మాయదారి కరోనా రోగం మనల్ని విడిచి వెళ్లేలా కనిపించడం లేదు. మరింతగా విస్తరిస్తూ రూపు మార్చుకుంటూ పంజా విసురుతూనే ఉంటోంది. రోజురోజుకు మరింత భయాందోళనలకు గురిచేస్తోంది. ఒక వైపు సెకండ్ వేవ్ విజృభణ తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్న జనాలకు డెల్టా ప్లస్ వేరియంట్ భయపెడుతోంది. కరోనా వైరస్ రోజు రోజుకు రూపాంతరం చెందుతూ వ్యాపిస్తోంది. తాజాగా రాజస్థాన్ లోనూ తొలి డెల్టా ప్లస్ కేసు నమోదైంది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 52 డెల్టా ప్లస్ కేసులు […]

Written By: NARESH, Updated On : June 27, 2021 9:10 am
Follow us on

ఈ మాయదారి కరోనా రోగం మనల్ని విడిచి వెళ్లేలా కనిపించడం లేదు. మరింతగా విస్తరిస్తూ రూపు మార్చుకుంటూ పంజా విసురుతూనే ఉంటోంది. రోజురోజుకు మరింత భయాందోళనలకు గురిచేస్తోంది. ఒక వైపు సెకండ్ వేవ్ విజృభణ తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్న జనాలకు డెల్టా ప్లస్ వేరియంట్ భయపెడుతోంది.

కరోనా వైరస్ రోజు రోజుకు రూపాంతరం చెందుతూ వ్యాపిస్తోంది. తాజాగా రాజస్థాన్ లోనూ తొలి డెల్టా ప్లస్ కేసు నమోదైంది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 52 డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి. థర్డ్ వేవ్ కు ఈ వైరస్ కారణమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నాయి.

ఇక తమిళనాడులో తొలి డెల్టా ప్లస్ వేరియంట్ తో మరణం సంభవించడం కలకలం రేపింది.మధ్యప్రదేశ్ లోనూ రెండు మరణాలు సంభవించాయి. జమ్మూకశ్మీర్ లోనూ తొలి కేసు నమోదు కావడంతో స్థానిక వ్యాపార సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు లాక్ డౌన్ విధించాయి.

ఇక కేంద్రం ఈ డెల్టా ప్లస్ వేరియంట్ పై అప్రమత్తమైంది. రాజస్థాన్ లో నమోదైన తొలి కేసు గ్రామంలో అందరికీ పరీక్షలు చేసి క్వారంటైన్ చేస్తోంది. పకడ్బందీగా డెల్టా ప్లస్ ను నివారించాలని కలెక్టర్, వైద్య సిబ్బందికి సూచించింది. యంత్రాంగం ఆ గ్రామంలోకి ఎవరిని రాకుండా కఠిన ఆంక్షలు విధించారు.

ఇక కరోనా వైరస్ సెకండ్ వేవ్ అంత తీవ్రంగా థర్డ్ వేవ్ ఉండదని తాజాగా భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రకటించింది. దేశంలో డెల్టా ప్లస్ కేసులు తక్కువగానే ఉన్నాయని.. వీటితో థర్డ్ వేవ్ ప్రారంభమయ్యే సూచనలులేవని తెలిపారు. భారీ వ్యాక్సినేషన్, కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తే థర్డ్ వేవ్ రాకుండా అరికట్టవచ్చని సూచించారు. ఇక ప్రస్తుతం దేశంలో వేస్తున్న టీకాలు ఈ డెల్టా ప్లస్ ను ఏ మేరకు అడ్డుకుంటుందనే దానిపై పరిశోధనలు సాగుతున్నాయి.