ఏపీలోని విశాఖలో ఉన్న హిందుస్థాన్ షిప్ యార్డ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వేర్వేరు విభాగాల్లో 53 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్, ఆఫీసర్, కన్సల్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. కాంట్రాక్ట్ విధానంలో, శాశ్వత ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
https://www.hslvizag.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 53 ఉద్యోగ ఖాళీలలో జనరల్ మేనేజర్ 1, అడిషనల్ జనరల్ మేనేజర్ 1, డీజీఎం 3, సీనియర్ మేనేజర్ 4, మేనేజర్ 8, డిప్యూటీ మేనేజర్ 1 ఉద్యోగ ఖాళీలు ఉండగా శాశ్వత ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ 2, ప్రాజెక్ట్ మేనేజర్ 1, ప్రాజెక్ట్ ఆఫీసర్ 28 (ఎఫ్‌టీసీ), సీనియర్ కన్సల్టెంట్ 3, కన్సల్టెంట్ 1 ఉద్యోగ ఖాళీలను మాత్రం కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తారు.
ఫుల్ టైమ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పటు నిర్దిష్ట అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుండగా ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఇతర కేటగిరీల అభ్యర్థులకు మాత్రం 300 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంది.
శాశ్వత పోస్టులకు జూలై 20, ఎఫ్‌టీసీ పోస్టులకు ఆగస్టు 10, కాంట్రాక్ట్ పోస్టులకు ఆగస్టు 30 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.