spot_img
Homeజాతీయ వార్తలుDelhi Exit Polls: హస్తినలో 27 ఏళ్ల తర్వాత సంచలన ఫలితం.. ఆ పార్టీ కి...

Delhi Exit Polls: హస్తినలో 27 ఏళ్ల తర్వాత సంచలన ఫలితం.. ఆ పార్టీ కి జై కొట్టిన ఓటర్లు..

Delhi Exit Polls:  వివిధ సంస్థలు అంచనా వేసిన ఫలితాల ప్రకారం చూసుకుంటే దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ గడ్డపై బిజెపి అధికారాన్ని దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. ఈసారి ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ వైపు మొగ్గు చూపారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని అనేక సంస్థలు తమ ఫలితాలలో వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలో చాలావరకు ఓటర్లు బిజెపి వైపు నిలబడ్డారని తెలుస్తోంది. ముఖ్యంగా 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ ఓటర్లు బిజెపికి పట్టంకట్టబోతున్నారు అని తెలియడంతో.. కాషాయ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటుంటారు.. పీపుల్స్ పల్స్ – కోడిమో సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం బిజెపి 51 నుంచి 60, ఆమ్ ఆద్మీ 10 నుంచి 19, కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని తెలుస్తోంది.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 48.5 నుంచి 52.5% వరకు ఓట్లను సాధిస్తోందని తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి 36.5 నుంచి 40.5 శాతం ఓట్లు లభిస్తాయని పీపుల్స్ పల్స్ – కోడిమో సంస్థలు చెబుతున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోరమైన ఫలితాలు వస్తాయని.. ఓటింగ్ శాతం 6.5 నుంచి 8.5% వరకే ఉంటుందని తెలుస్తోంది. ఇతరులు 3.1 నుంచి 5.1 శాతం వరకు ఓట్లు పొందడానికి అవకాశం ఉంటుందని పీపుల్స్ పల్స్ – కోడిమో సంస్థలు అంచనా వేస్తున్నాయి..

మహిళా ఓటర్లు ఆ పార్టీ వైపే..

పీపుల్స్ పల్స్ – కోడిమో సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే.. మహిళా ఓటర్లు మాత్రమే ఆప్ వైపు ఉన్నారని తెలుస్తోంది. వీరిలో 8.3 శాతం మంది మాత్రమే బిజెపిపై నమ్మకంతో ఉన్నారని సమాచారం.. మహిళల. విభాగంలో ఆప్ కు 50.20 శాతం మంది జై కొట్టారట. భారతీయ జనతా పార్టీకి 41.90%, కాంగ్రెస్ పార్టీకి 6.10%, ఇతరుల వైపు 1.90 శాతం మద్దతు ఇస్తున్నారని పీపుల్స్ పల్స్ – కోడిమో సంస్థలు చెబుతున్నాయి. బిజెపి వైపు బ్రాహ్మణులు, రాజ్ పుత్, యాదవ్, జాట్, బనియా, కాశ్మీరీ పండిట్లు, గుప్త సామాజిక వర్గాలు నిలిచారని తెలుస్తోంది.. అగ్రవర్ణాలు, వెనుకబడిన ఓ బీసీలు, దళితులు ఆప్ వైపు ఉన్నారట.

మిగతా వర్గాలు

హిందువులు, జైన్ లు, ఇతరులు భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించారు. సిక్కులు, ముస్లింలు ఆప్ కు జై కొట్టారు.. ఉత్తరాది, హర్యానా బి, పహడి, పూర్వాంచల్ ప్రాంతాలు బిజెపికి మద్దతు ఇచ్చాయి. పంజాబీలు, దక్షిణాది ప్రజలు, సిక్కులు, యాదవ్, చమార్, వాల్మీకి సామాజిక వర్గాల వారు ఆమ్ ఆద్మీ పార్టీకి జై కొట్టారు. అయితే అధికారంలోకి బిజెపి వస్తున్నప్పటికీ బూస్ట్ పాపులర్ నాయకుడిగా అరవింద్ కేజ్రివాల్ గెలిచినట్టు సర్వే సంస్థలు చెబుతున్నాయి. అయితే మెజారిటీ ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే అభివృద్ధి సాధ్యమని అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version