Delhi Exit Polls: ఢిల్లీలో ఎన్నికలు ముగిశాయి. 70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.. ఓటర్లు రెట్టించిన ఉత్సాహంతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి ఢిల్లీ ఓటర్లు స్పష్టమైన తీర్పును ఇస్తారని ముందుగానే సర్వే సంస్థలు ప్రకటించాయి. దానికి తగ్గట్టుగానే ఓటర్లు చైతన్యవంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
ఎన్నికలు ముగిసిన తర్వాత సహజంగా ఎగ్జిట్ పోల్స్ సంస్థలు తమ ఫలితాలను వెల్లడిస్తాయి. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం సాయంత్రం 5 తర్వాత ఆయా సంస్థలు తాము సేకరించిన శాంపిల్స్ ఆధారంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించడం మొదలుపెట్టాయి. అయితే ఈసారి ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత సరికొత్త ఫలితం వస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేశాయి. ఇది అది అని తేడా లేకుండా.. అన్ని సంస్థలు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రకటించాయి.. ఈసారి దురదృష్టవశాత్తూ కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపించదని అన్ని సంస్థలు వెల్లడించాయి.
సంస్థలు వెల్లడించిన పోల్స్ ఎలా ఉన్నాయంటే..
Matrige
మాట్రిజ్ సంస్థ ఆప్ కు 32 నుంచి 37 సీట్లు వస్తాయని ప్రకటించింది. బిజెపికి 35 నుంచి 40 వరకు వస్తాయని వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి సున్నా లేదా ఒక స్థానం వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
Peoples insite
పీపుల్స్ ఇన్ సైట్ సంస్థ ఆప్ కు 25 నుంచి 29 సీట్లు వస్తాయని వెల్లడించింది. భారతీయ జనతా పార్టీకి 40 నుంచి 44 స్థానాలు వస్తాయని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి 0 నుంచి ఒక స్థానం వస్తుందని అంచనావేసింది.
Times now
టైమ్స్ నౌ సంస్థ ఆప్ కు 22 నుంచి 31 స్థానాలు వస్తాయని ప్రకటించింది.. భారతీయ జనతా పార్టీకి 39 నుంచి 45 స్థానాలు వస్తాయని వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి 0 నుంచి 2 స్థానాలు వస్తాయని లెక్క కట్టింది.
P – mark
పీ మార్క్ అనే సంస్థ ఆప్ కు 21 నుంచి 31 స్థానాలకు వస్తాయని ప్రకటించింది. భారతీయ జనతా పార్టీకి 39 నుంచి 49 స్థానాలు వస్తాయని వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి సున్నా లేదా ఒక స్థానం వచ్చే అవకాశం ఉందని చెప్పింది.
Peoples pulse
పీపుల్స్ పల్స్ అనే సంస్థ ఆప్ కు పది నుంచి 19 స్థానాలు వస్తాయని ప్రకటించింది. బిజెపికి 51 నుంచి 60 స్థానాలు వస్తాయని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి 0 సీట్లు వస్తాయని వెల్లడించింది.
Chanakya strategies
చాణక్య స్ట్రాటజీస్ అనే సంస్థ ఆప్ కు 25 నుంచి 28 స్థానాల వస్తాయని లెక్క కట్టింది. భారతీయ జనతా పార్టీకి 39 నుంచి 44 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్ పార్టీకి రెండు లేదా మూడు స్థానాలు వస్తాయని ప్రకటించింది. పోల్ డైరీ అనే సంస్థ ఆప్ కు 18 నుంచి 25 స్థానాలు వస్తాయని వెల్లడించింది. భారతీయ జనతా పార్టీకి 42 నుంచి 50 స్థానాలు వస్తాయని.. కాంగ్రెస్ పార్టీకి 0 నుంచి 2 స్థానాలు వస్తాయని వెల్లడించింది.