https://oktelugu.com/

బోల్డ్ వెబ్ సిరీస్ లో రాశి, నభా !

కరోనా, థియేటర్ల వ్యవస్థను దెబ్బ తీసినా.. డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ కు మాత్రం బాగా ప్లస్ అయింది. ఈ లాక్ డౌన్ మొదలైన దగ్గర నుండి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ రోజురోజుకూ జనంలోకి చొచ్చుకొని పోయాయి. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి ఫాలోవర్స్ ఈ లాక్ డౌన్ విపరీతంగా పెరిగారు. భవిష్యత్తులో కూడా ఈ ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే జనానికి వెబ్ థియేటర్లు బాగా కనెక్ట్ అయిపోయాయి. ఫోన్స్ లోనే కొత్త సినిమా […]

Written By:
  • admin
  • , Updated On : November 5, 2020 / 04:31 PM IST
    Follow us on


    కరోనా, థియేటర్ల వ్యవస్థను దెబ్బ తీసినా.. డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ కు మాత్రం బాగా ప్లస్ అయింది. ఈ లాక్ డౌన్ మొదలైన దగ్గర నుండి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ రోజురోజుకూ జనంలోకి చొచ్చుకొని పోయాయి. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి ఫాలోవర్స్ ఈ లాక్ డౌన్ విపరీతంగా పెరిగారు. భవిష్యత్తులో కూడా ఈ ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే జనానికి వెబ్ థియేటర్లు బాగా కనెక్ట్ అయిపోయాయి. ఫోన్స్ లోనే కొత్త సినిమా చూసుకునే ఛాన్స్ ఉన్నప్పుడు ఇక జనం థియేటర్లకు ఎందుకు వెళ్తారు. ఓటీటీలో అయితే.. ఏదైనా సీన్ నచ్చితే మళ్లీ వెనుకకు వెళ్లి ఆ సీన్ పెట్టుకుని మళ్లీ హ్యాపీగా చూడొచ్చు. అదే థియేటర్ లో అయితే ఆ ఆవకాశం ఉండదు కదా. అందుకే ఓటీటీకి అందరూ జై కొడుతున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    అందుకే జనం కూడా స్టార్ హీరో సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారు. పైగా కొత్త కొత్త వెబ్ సిరీస్ లను కూడా కోరుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్ లు జనంలోకి బాగా వెళ్లాయి. అందుకే కొందరు హీరోహీరోయిన్లు కూడా డిజిటల్ ఫిల్మ్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే బడా నిర్మాతలు సైతం కొంతమంది ఫేమస్ నటీనటులతో వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది తమిళ నిర్మాతలు కూడా తెలుగు – తమిళంలో ఒకేసారి ఓ వెబ్ సిరీస్ ను నిర్మించడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

    Also Read: ఆర్ఆర్ఆర్: చరణ్ వర్సెస్ ఎన్టీఆర్.. సరికొత్త ట్విస్ట్.!

    బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా మరియు టాలెంటెడ్ బ్యూటీ నభా నటేష్ కలయికలో ఓ సిరీస్ చేస్తున్నారు. ఇది ఒక ఎమోషనల్ సిరీస్ అని, సిరీస్ లో కంటెంట్ కాస్త హద్దులు దాటి ఉండబోతుందని.. అలాగే మెయిన్ గా ఇద్దరి హీరోయిన్ల పాత్రల మధ్య వచ్చే బోల్డ్ సీన్స్ కూడా చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయని తెలుస్తోంది. పైగా ఈ సిరీస్ లో కొన్ని సీన్స్ బాగా బోల్డ్ గా ఉంటాయట. ఇలాంటి కథాబలం ఉన్న వెబ్ సిరీస్ స్టోరీలో నటిస్తేనే తమ ప్రతిభను కనబర్చడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందనే ఉద్దేశ్యంతో రాశి ఖన్నా, నభా నటేష్ ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి అంగీకరించారని.. అలాగే కథా పరంగా కూడా తమ పాత్రలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. అన్నట్టు ఈ వెబ్‌ సిరీస్‌కు తమిళ్ దర్శకుడు సూర్య సుబ్రమణ్యన్ దర్శకత్వం వహించబోతున్నాడు.