నిర్భయ దోషుల ఉరి ఖరారు?

దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన నిర్భయ అత్యాచార హత్యా కేసుకి సంబంధించి తుది తీర్పు మరి కాసేపట్లో వెలువడనుంది. నిర్భయ దోషులకు మార్చి 3న ఉరిశిక్ష అమలుచేయాలంటూ ఢిల్లీ పాటియాలా కోర్టు మూడోసారి డెత్ వారెంట్ జారీచేసిన విషయం తెలిసిందే. అయితే, దోషులు మాత్రం మరోసారి ఉరిని వాయిదా వేయించుకోవాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు లేదు. తమకు ఉన్న న్యాయపరమైన అంశాలను దోషులు వినియోగించుకున్నారు. తాజాగా, నిర్భయ దోషి పవన్ గుప్తా దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను […]

Written By: Neelambaram, Updated On : March 2, 2020 5:49 pm
Follow us on

దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన నిర్భయ అత్యాచార హత్యా కేసుకి సంబంధించి తుది తీర్పు మరి కాసేపట్లో వెలువడనుంది. నిర్భయ దోషులకు మార్చి 3న ఉరిశిక్ష అమలుచేయాలంటూ ఢిల్లీ పాటియాలా కోర్టు మూడోసారి డెత్ వారెంట్ జారీచేసిన విషయం తెలిసిందే. అయితే, దోషులు మాత్రం మరోసారి ఉరిని వాయిదా వేయించుకోవాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు లేదు. తమకు ఉన్న న్యాయపరమైన అంశాలను దోషులు వినియోగించుకున్నారు. తాజాగా, నిర్భయ దోషి పవన్ గుప్తా దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది. దీంతో రేపు(మార్చి 3) ఉదయం 6గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు. పవన్ గుప్తా పిటిషన్‌ను తిరస్కరించిన జస్టిస్ ఎన్ వి రమణ ఐదుగురు ధర్మాసనం. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం తుది తీర్పు వెల్లడించింది. దోషికి కింది కోర్టు ఉరిశిక్ష విధించడంలో ఎలాంటి తప్పులేదని అభిప్రాయపడింది.