Homeఎంటర్టైన్మెంట్మార్చి లో రిలీజ్ కానున్న 8 సినిమాలు ఇవే..

మార్చి లో రిలీజ్ కానున్న 8 సినిమాలు ఇవే..

 

ఒకప్పుడు టాలీవుడ్ లో మార్చి నెలలో సినిమాలు రిలీజ్ చేయాలంటే వెనుకడుగు వేసేవారు నిర్మాతలు. మార్చి అన్ సీజన్ అనే ఫీలింగ్ అందరిలో ఉండేది. కానీ ఇప్పుడు ఈ సెంటిమెంట్ కు బ్రేక్ పెట్టి మార్చి నెలలో సినిమాలు రిలీజ్ చేసేందుకు మేకర్స్ ముందుకొస్తున్నారు. ముందుగా మార్చి 6న 3 సినిమాలు విడుదల కానున్నాయి అవి ‘పలాస 1978 ‘,’ఓ పిట్ట క‌థ’,’అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. మార్చి 25న ‘వి’ సినిమాతో నాని అలరించనున్నాడు.

మార్చి లో రిలీజ్ కానున్న 8 సినిమాల వివరాలు…

‘పలాస 1978 ‘మార్చి 6

‘లండన్‌ బాబులు’ సినిమా ఫేమ్‌ రక్షిత్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘పలాస 1978’. ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పాటలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రెయిలర్ విడుదల చేశారు.

‘పలాస 1978’ సినిమాతో కరుణ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా బిక్రమ్ కృష్ణ ఫిలింస్ పతాకంపై అప్పారావు బెల్లన, అట్లూరి వరప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం  పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 6 విడుదల విడుదల కానున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాకు రఘు కుంచె సంగీత దర్శకత్వం వహించడమే కాకుండా సినిమాలో ఓ కీలక పాత్ర కూడా పోషిస్తున్నారు.

Palasa 1978 Telugu Movie Trailer | Karuna Kumar |Rakshit, Nakshatra, Raghu Kunche

‘ఓ పిట్ట క‌థ’ మార్చి 6

ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్‌ నిర్మిస్తున్న తాజా చిత్రం ఓ పిట్ట కథ.. కొత్తవాళ్ళతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి చెందు ముద్దు దర్శకత్వం వహించారు. విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. బ్రహ్మాజీ ఓ కీలకపాత్రలో నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మార్చ్ 6 న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

O Pitta Katha Official Trailer | Viswant | Sanjay Rao | Nitya Shetty | Brahmaji | Shreyas Media

‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ మార్చి 6

ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న చిత్రం ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. ఈ సినిమాకి బాలు అడుసుమిల్లి దర్శకత్వం వహించగా బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకాలపై హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మించారు. నలుగురు అమ్మాయిల చుట్టూ అల్లుకున్న ఈ చిత్రం మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://www.youtube.com/watch?v=UgdB2r8x07Y

‘వి’ (నాని) మార్చి 25

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా, మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వి’. ఈ సినిమా ప్రారంభమన నాటి నుంచి చిత్రంపై భారీ అంచనాలున్నాయి. వి చిత్రంలో నాని నెగెటివ్ షేడ్స్ ఉండే కిల్లర్ కిల్లర్ రోల్ చేస్తున్నాడని తెలియడంతో మరింత ఆసక్తి రేగింది. ఇక ఇప్పటికే విడుదలైన వి మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.వి మూవీ ఉగాది కానుకగా మార్చి 25  గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అమిత్ త్రివేది అందిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

V Teaser - Nani, Sudheer Babu, Nivetha Thomas, Aditi Rao Hydari | Mohan Krishna Indraganti

 

కాలేజ్ కుమార్ (మార్చి 6)

లక్ష్మణ గౌడ సమర్పణలో ఎమ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై హరి సంతోష్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “కాలేజ్ కుమార్ ” మూవీ రూపొందింది.ఇందులో సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న మూవీ మార్చి 6వ తేదీ రిలీజ్ కానున్నది.

అర్జున (మార్చి 6)

నట్టి ఎంటర్ టైన్ మెంట్స్, క్విటీ ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణ లో AA ఆర్ట్స్ బ్యానర్ పై కన్మణి దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా రాజకీయాల నేపథ్యం లో “అర్జున ” మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరో రాజశేఖర్ తండ్రీకొడుకులు గా నటించడం విశేషం. ఈ మూవీ మార్చి 6వ తేదీ విడుదల కానున్నది.

స్క్రీన్ ప్లే (మార్చి 6)

బుజ్జి బుడుగు ఫిల్మ్స్ బ్యానర్ పై కె ఎల్ ప్రసాద్ దర్శకత్వంలో “స్క్రీన్ ప్లే ” మూవీ తెరకెక్కనుంది. “స్క్రీన్ ప్లే ” మూవీ పలు ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కు ఎంపిక అయిన ఈ మూవీ మార్చి 6వ తేదీ రిలీజ్ కానున్నది.

కృష్ణ మనోహర్ IPS (మార్చి 6)

యనమల సుధాకర్ నాయుడు సమర్పణ లో పవన పుత్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ముగిల్ చెల్లప్పన్ దర్శకత్వంలో ప్రభుదేవా, నివేత పేతురాజ్ జంటగా “కృష్ణ మనోహర్ IPS” మూవీ రూపొందింది. ప్రభు దేవా 50 వ మూవీ గా రూపొందిన ఈ మూవీ తమిళ , తెలుగు వెర్షన్స్ 6వ తేదీ రిలీజ్ కానున్నాయి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version