
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు జైలుకు వెళ్లడంపై ఏపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన బెయిల్ పై శుక్రవారం విచారణ జరగనుండడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ దూషణల కేసులో అరెస్టయిన రఘురామను ప్రస్తుతం సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతకుముందు ఆయనను విచారణ పేరుతో థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఎంపీ హైకోర్టు న్యాయవాదికి ఫిర్యాదు చేశారు. అయితే సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ఆయనకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ధూషణల కేసులో అరెస్టయిన ఎంపీని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రఘురామ హైకోర్టులో తనను సీఐడీ అధికారులు కొట్టారని ఫిర్యాదు చేయడంతో ఎంపీని రమేశ్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సీఐడీ కోర్టు ఆదేశించింది. అటు హైకోర్టు కూడా ఇవే ఆదేశాలు ఇచ్చినా సీఐడీ అధికారులు పట్టించుకోకుండా జీజీహెచ్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించి జైలుకు తరలించారు. అయితే హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించారని సుప్రీంలో ఎంపీ తరుపున న్యాయవాదులు పిటిషన్ వేశారు.
దీంతో ఆయనకు ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందించాలని సూచించడంతో ప్రస్తుతం అక్కడే వైద్య పరీక్షలతో పాటు చికిత్స చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన రిపోర్టు ఇప్పటికే సీల్డ్ కవర్లో సుప్రీం కోర్టుకు వెళ్లింది. దీంతో వైద్య పరీక్షల్లో ఏముందోనన్న ఆసక్తి అందరిలో నెలకింది. రఘురామ చెప్పినట్లుగా సీఐడి అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారా..? లేక సీఐడీ అధికారులు చెప్పినట్లు కాళ్ల వాపులు మాత్రమే వచ్చాయా..? అన్నది తేలాల్సి ఉంది.
ఇక ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఎంపీపై రాజద్రోహం కేసు పెట్టాల్సి వచ్చిందిన ప్రభుత్వం తరుపున న్యాయవాదులు ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేశామన్నారు. అయితే దీనిపై రఘురామరాజు బెయిల్ కోసం అప్లై చేశారు. ఇవన్నీ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని సుప్రీం ఈరోజు మధ్యాహ్నం విచారించనుంది. జస్టిస్ వినీత్ శరణ్,జస్టిస్ బి.జఆర్. గవాయిలతో కూడిన ధర్మాసంన ఎదుట కేసు జాబితాలో 25వ నంబర్ ఐటమ్ గా ఈ కేసును విచారించనున్నారు.