
టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి బీ జనార్దన్ రెడ్డి తోపాటు ఏడుగురు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. వీరికి టీఎస్పీఎస్సీ సిబ్బందితో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఖాళీగా ఉన్న టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవితో పాటు కమిషన్ సభ్యుల పదవులను రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ భర్తీ చేసిన విషయం తెలిసిందే. వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి జనార్దన్ ను చైర్మన్ గా నియమించారు. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. కారం రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ, రిటైర్డ్ ఈఎస్సీ రమావత్ ధన్ సింగ్, సీబీఐటీ ప్రొఫెసర్ బీ లింగారెడ్డి, ఎస్డీసీ కోట్ల అరుణ కుమారి, ఆచార్య సుమిత్రా ఆనంద్ తనోబా, ఆయుర్వేద వైద్యులు అరవెల్లి చంద్ర శేఖర్ రావులకు సభ్యులుగా అవకాశం దక్కింది.