
ఇప్పటి వరకు ప్రపంచ కుభేరుల్లో భారత్ చెందిన వారు టాప్ 10 లేదా 20లో ఉంటూ వచ్చారు. తాజాగా ఆసియా ధనవంతుల్లో మొదటి, రెండు స్థానాలు భారతీయులకే దక్కాయి. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ రియల్ టైమ్ ఇండెక్స్ ప్రకారం ఆసియా కుబేరుల్లో మొదటి స్థానం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఉండగా.. రెండో కుబేరుడిగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నిలిచారు. ఇటీవల కాలంలో ఆయన సంపద అమాంతం పెరిగింది . దీంతో ఆయన ఆసియా రెండో కుబేరుడిగా స్థానం దక్కించుకున్నాడు.
ఇప్పటి వరకు ఆసియా రెండో ధనవంతుడిగా చైనాకు చెందిన టైకూన్ జోంగ్ షన్షాన్ ఉన్నారు.అయితే తాజాగా ఆయన సంపద 6,360 కోట్లకు కరిగిపోయింది. ఇదే సమయంలో అదానీ గ్రూప్ షేర్లు 6,650 కోట్లకు పెరిగింది. భారతీయ కరెన్సీ ప్రకారం ఆయనకరెన్సీ రూ.4.86 లక్షల కోట్లు. ఈ ఏడాది ఆయన ఆస్తి రూ.3,270 కోట్ట మేర పెరిగింది. అదానీ గ్రూప్ నకు చెందిన అదానీ ఎంటర్ ప్రైజేస్ అదానీ గ్రీన్ , అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్ వంటివి భారీగా సేల్ అయ్యాయి.
అయితే ఆసియా మొదటి కుబేరుల్లో మొదటి స్థానంలో ఉన్న ముఖేశ్ అంబానీ ఈ ఏడాదిలో 17.55 కోట్ల డార్లు తగ్గింది. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల్లో అంబానీ 13వ స్థానంలో ఉన్నారు. గౌతమ్ అదానీ 14వ స్థానంలో ఉన్నట్లు బిలియనీర్ ఇండెక్స్ తెలిపింది. సీబార్న్ కార్గోలో ప్రస్తుతం అదానీ గ్రూప్ ఆధీనంలో 25 శాతం వరకు ఉందని నివేదికలు చెబుతున్నాయి. చైనా కుబేరుడు 14వ స్థానం నుంచి 15వ స్థానానికి పడిపోయారు.